కేంద్ర నిర్ణయాలను అమ్మాయిలతో పోలుస్తూ..’ఒక్క అబ్బాయి కోసం ఐదుగురు అమ్మాయిలు’ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

  • Published By: nagamani ,Published On : June 25, 2020 / 06:17 AM IST
కేంద్ర నిర్ణయాలను అమ్మాయిలతో పోలుస్తూ..’ఒక్క అబ్బాయి కోసం ఐదుగురు అమ్మాయిలు’ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ విద్యా మంత్రి జితూ పట్వారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చిక్కుల్లోపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమ్మాయిలతో పోలుస్తూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.  డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి నిర్ణయాలను అమ్మాయిలతో పోలుస్తూ..’ఒక్క అబ్బాయి కోసం ఐదుగురు అమ్మాయిలు’ అంటూ  ట్వీట్ లో వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వికాస్ (అభివృద్ధి) అనే కొడుకు కోసం  ఇప్పటికే ఐదుగురు కూతుళ్లను అందించిందనే అర్థంవచ్చేలా జితూ పట్వారీ  ట్వీట్ చేయటం దుమారంగా మారింది. ప్రజలు అభివృద్ధినికోరుకుంటుంటే కేంద్రం మాత్రం అభివృద్ధిదెబ్బతినే పలు సంచలనాత్మక నిర్ణయాలు (డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి నిర్ణయాలు) తీసుకుంది వ్యాఖ్యానించారు.

జితూ పట్వారీ  వ్యాఖ్యల సారాంశం..”ప్రజలంతా ఓ కొడుకు కావాలని అనుకుంటున్నారు. అంటే అభివృద్ది అంటే కొడుకు అనే అర్థం వచ్చేలా.. కానీ, కూతుళ్లు మాత్రమే పుడుతున్నారు. అభివృద్ధి అనే కొడుకు మాత్రం పుట్టడం లేదు” అని మధ్యప్రదేశ్ రవూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జితూ పట్వారీ చేసిన ఈ ట్వీట్ పై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు.

ప్రజాప్రతినిథిగా ఉన్న ఓ వ్యక్తి ఇలా లింగ సమానత్వాన్ని మరచిపోయి బాధ్యత లేకుండా వ్యాఖ్యానించటమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒకేలా చూడకుండా..ఇటువంటి వివక్షా పూరిత వ్యాఖ్యలేంటని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో జితూ పట్వారీ దిగివచ్చారు. క్షమాపణలు చెబుతూ, మరో పోస్ట్ పెట్టారు. “నా వ్యాఖ్యలతో ఎవరి మనస్సులైనా బాధించి ఉంటే దానికి నేను చింతిస్తున్నాను..నాకు కూతుళ్లంటే దేవతల వంటి వారు. నరేంద్ర మోదీ దేశ వెన్నెముకను విరిచేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థికమాంద్యం… ఇలా ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయి.

ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారన్న ఆలోచనతో ఈ ట్వీట్ పెట్టాను తప్ప ఆడపిల్లను అవమానించాలని ఎంతమాత్రం కాదని వివరణ ఇచ్చుకున్నారు.  ఎవరైనా మనస్తాపం చెందివుంటే క్షంతవ్యుడిని” అని అంటూ పోస్ట్ పెట్టారు.  

Read: దేశంలోనే తొలిసారి..ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక మెట్రో స్టేషన్..