Richa Chadha’s tweet Row: ఆర్మీని నేను ఎగతాళి చేశాననడం సరికాదు: నగ్మా

‘‘నేను కల్నల్ అశోక్ సింగ్ చేసిన ట్వీట్ ను మాత్రమే సమర్థించాను. అంతేగానీ, రిచా చద్దా ట్వీట్ ను కాదు. నేను ఆర్మీని ఎగతాళి చేస్తున్నానని అనడం సరికాదు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆర్మీ సిద్ధంగా ఉంటే మరి బీజేపీ అందుకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?’’ అని నగ్మా ప్రశ్నించారు.

Richa Chadha’s tweet Row: ఆర్మీని నేను ఎగతాళి చేశాననడం సరికాదు: నగ్మా

Richa Chadha’s tweet Row: సినీ నటి రిచా చద్దా ఇటీవల చేసిన ఓ ట్వీట్‌లో గల్వాన్ ప్రస్తావన తీసుకొచ్చి ఆర్మీని కించపర్చారంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఆమె ట్వీట్ ను అలా ఎందుకు అర్థం చేసుకున్నారంటూ కల్నల్ అశోక్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. ‘‘రిచా చద్దా చేసిన ట్వీట్ సరికాదంటూ వివాదం చెలరేగుతోంది. గల్వాన్ లో ప్రాణత్యాగం చేసిన మన సైనికులను కించపర్చేలా ఆమె వ్యాఖ్యలు చేసిందని నేను భావించడం లేదు. సర్వీసులో ఉన్న ఓ జనరల్ ఎన్నికల వేళ బీజేపీకి అనుకూలంగా ఇచ్చిన ఓ రాజకీయ ప్రకటనను (పీవోకేను స్వాధీనం చేసుకుంటామని) లక్ష్యంగా చేసుకుని రిచా ట్వీట్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఆర్మీ రాజకీయీకరణ అయితే వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలి’’ అని కల్నల్ అశోక్ సింగ్ పేర్కొన్నారు.

ఆయన ట్వీట్ ను రీట్వీట్ చేసిన సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా ‘సరిగ్గా చెప్పారు’ అని పేర్కొన్నారు. దీంతో నగ్మా కూడా రిచా చద్దా ట్వీట్ ను సమర్థిస్తున్నారని, ఆర్మీని కించపర్చుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై నగ్మా స్పందించారు. ఆమె ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను కల్నల్ అశోక్ సింగ్ చేసిన ట్వీట్ ను మాత్రమే సమర్థించాను. అంతేగానీ, రిచా చద్దా ట్వీట్ ను కాదు.

నేను ఆర్మీని ఎగతాళి చేస్తున్నానని అనడం సరికాదు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆర్మీ సిద్ధంగా ఉంటే మరి బీజేపీ అందుకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?’’ అని ప్రశ్నించారు. కాగా, పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తే వెంటనే అమలు చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని భారత ఉత్తర కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర త్రివేదీ అన్నారు. దానిపై రిచా చద్దా ట్వీట్ చేస్తూ.. ‘‘గల్వాన్ హాయ్ చెబుతోంది’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో వివాదం మొదలైంది. చివరకు ఆమె క్షమాపణలు చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..