Rahul Gandhi: రాహుల్ గాంధీకి పెగాసస్ ఎదురుదెబ్బ

రాహుల్ గాంధీకి సైతం పెగాసస్ ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ వేదికగా ఈ విషయంపై రచ్ఛ మొదలైంది. అతని ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఇది పూర్తిగా రాజద్రోహమేనని అన్నారు.

Rahul Gandhi:  రాహుల్ గాంధీకి పెగాసస్ ఎదురుదెబ్బ

Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ గాంధీకి సైతం పెగాసస్ ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ వేదికగా ఈ విషయంపై రచ్ఛ మొదలైంది. అతని ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఇది పూర్తిగా రాజద్రోహమేనని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా.. సంస్థలపై ‘పెగాసస్‌’ స్పైవేర్‌తో నిఘా పెట్టారని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

‘పెగాసస్‌ను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆయుధంగా కేటాయించి ఉంచింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు రెడీ చేసిన దీనిని.. ప్రధాని, హోంమంత్రి రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని పలు సంస్థలపై ప్రయోగించారు. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఫోన్‌పైనా నిఘా పెట్టారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వినియోగించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని పెగాసస్ ఉపయోగించే కూల్చారు.

నా ఫోన్‌ నెంబరు వాళ్ల లిస్టులో ఉండటం కాదు.. నా మొబైల్‌ను కూడా ట్యాప్‌ చేశారు. ఇది కేవలం రాహుల్‌గాంధీ ప్రైవసీకి సంబంధించిన విషయం కాదు. దేశ ప్రజల గొంతుకపై చేసిన దాడి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా రాజద్రోహం’ అని రాహుల్‌ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్రం సమాధానం చెప్పాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.