స్టైలిష్ లుక్ లో రాహుల్ గాంధీ..ఫొటోలు వైరల్

స్టైలిష్ లుక్ లో రాహుల్ గాంధీ..ఫొటోలు వైరల్

RAHULGANDHI STYLISH LOOK                                           కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. సాధారణంగా ఎప్పుడూ పైజమా మరియు కుర్తా ధిరించి కన్పించే రాహుల్ గాంధీ సడన్ గా తన డ్రెస్సింగ్ స్ట్రైల్ ని మార్చేశారు. ఫార్మల్ డ్రెస్‌లో స్టయిలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. మంగళవారం హాఫ్ హ్యాండ్ స్లీవ్ షర్ట్ తో కూడిన ట్రౌజర్ ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరైన రాహుల్ ని సొంతపార్టీ నేతలే కొద్ది సేపు గుర్తుపట్టలేకపోయారు.

చేతిలో ట్యాబ్ పట్టుకుని స్టయిల్‌గా నడిచి వస్తుంటే ఎవరబ్బా ఇతను అని తేరిపారా చూసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు..తర్వాత రాహుల్ అని తెలుసుకుని షాక్ అయ్యారు. రాహుల్ గాంధీ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు చాలామంది అభిప్రాయపడుతున్నారు. త్వరలో యువరాజు పట్టాభిషేకం ఉంటుందనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌లో చాలా మార్పులు వస్తున్నాయి.

ఇటీవల, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడు వెళ్లిన రాహుల్ గాంధీ.. అక్కడి వారితో పూర్తిగా మమేకమైపోయారు. అక్కడి ఓ ప్రముఖ వంటల యూట్యూబ్ చానెల్‌‌ కోసం పుట్టగొడుల బిర్యానీ తయారీలో రాహుల్ కూడా పాల్గొని వారితో పాటు భోజనం చేసి అందరనీ ఆశ్చర్యపరిచారు. యువతను ఆకట్టుకునే విధంగా రాహుల్ గాంధీలో పలు మార్పులు వస్తున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీలో ఈ మార్పు కాంగ్రెస్ కి ఉపయోగపడుతుందంటున్నారు.