Twitter CEO : ఫాలోవర్స్ సంఖ్య ఎలా తగ్గుతోంది.. ఇందులో కుట్ర ఉందన్న రాహుల్

ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని...భారత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి స్వేచ్చ లేకుండా చేయడంలో ట్విట్టర్ (Twitter)....

Twitter CEO : ఫాలోవర్స్ సంఖ్య ఎలా తగ్గుతోంది.. ఇందులో కుట్ర ఉందన్న రాహుల్

Rahul Gandhi

Rahul Gandhi And Twitter CEO : ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని…భారత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి స్వేచ్చ లేకుండా చేయడంలో ట్విట్టర్ (Twitter) సహకరిస్తోందని కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు 2022, జనవరి 27వ తేదీ గురువారం ట్విట్టర్ ఇండియా సీఈఓ పరాగ్ అగర్వాల్ కి ఆయన లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన ట్విట్టర్ ఖాతాను కొత్తగా ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని, తనతో పాటు కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ విషయంలో కూడా ఇలాగే జరిగిందని వెల్లడించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాల ఫాలోవర్స్ సంఖ్య మాత్రం అనుహ్యంగా ఎలా పెరిగిందని డౌట్ వ్యక్తం చేశారాయన.

Read More : Casino Controversy : గవర్నర్ దృష్టికి కాసినో వ్యవహారం.. టీడీపీ నేతల ఫిర్యాదు

ఇందుకు ఆయన లేఖలో వివరాలు పొందుపరిచారు. 2021 సంవత్సరం మెదటి ఆరు నెలల్లో సగటున 4 లక్షల మంది కొత్తగా ఫాలోవర్స్ తన ఖాతాను అనుసరించే వారని, గత సంవత్సరం ఆగస్టులో తన ఖాతాను ఎనిమిది రోజుల పాటు సస్పెన్షన్ విధించిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీని వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. సస్పెన్షన్ తర్వాత తన ఖాతాను ఫాలో అయ్యేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. తన గొంతును సోషల్ మీడియాలో అణిచి వేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మరోసారి ఆరోపించారు. తాను పెట్టె పోస్టులకు మంచి స్పందన వస్తున్నదని.. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను పోస్టులు పెడుతున్నందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

Read More : Ayodhya: అయోధ్య రామాలయంలో తిరుమల తరహా భద్రత

ఆత్యాచార భాదితుల గురించి, రైతుల సంఘీభావంగా నిలబడితే తప్పా ? అని ప్రశ్నించారాయన. రైతు చట్టాలకు వ్యతిరేకంగా, రైతులపై ట్రాక్టర్ ఎలా ఎక్కించారో వాటి వీడియోలను తాను ట్విట్టర్ లో పోస్టు చేయడం జరిగిందన్నారు. దీనిని దేశ వ్యాప్తంగా అత్యధికంగా వీక్షించినట్లు.. తన గొంతుకను ప్రజలకు చేరకుండా అణిచివేసేందుకు ట్విట్టర్ పై ప్రభుత్వం వత్తిడి చేసిందని లేఖలో ఆరోపించారు. అభ్యంతకర పోస్టులు, ఇతర వ్యక్తులు పోస్టులు చేస్తే వారిపై ట్విట్టర్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యనాయకుల అభ్యంతరకర పోస్టులపై ట్విట్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కుట్రలకు ట్విట్టర్ పావుగా మారకూడదని..అందుకే భారతదేశ వంద కోట్ల జనాల తరుపున లేఖ రాస్తున్నట్లు రాహుల్ తెలిపారు.