Raja Pateria Arrest: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాజా పటేరియా అరెస్ట్ ..

ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పన్నా పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. దామోహ్ జిల్లాలో అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు.

Raja Pateria Arrest: ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాజా పటేరియా అరెస్ట్ ..

Raja Pateria Arrest

Raja Pateria Arrest:ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పన్నా పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. దామోహ్ జిల్లాలో అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యప్రదేశ్ పోలీసులు పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పన్నా జిల్లాలోని పొవై పోలీస్ స్టేషన్ లో పటేరియాపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 451, 504, 505 (1-బి), 505 (1-బి) సెక్షన్లు నమోదయ్యాయని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిర్యాదు సి), 506, 153-బి (1సి) కింద కేసు నమోదు చేశారు.

PM Modi Foreign Visit: ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశాల పర్యటనకు ఖర్చు ఎంతైందో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ మతం, కులం, భాష ప్రాతిపదికన విభజిస్తున్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండిండి.. చపండం అంటే ఓడించే పనిచేయండి.. అంటూ కాంగ్రెస్ నేత రాజా పటేరియా పన్నా జిల్లాలోని పోవై పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఈ వీడియో వైరల్ కావటంతో రాష్ట్ర హోమంత్రి నరోత్తమ్ మిశ్రా ఆదేశాల మేరకు పటేరియాపై పన్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

PM Modi: అలాంటి రాజకీయాలు చేసే నాయకులను హెచ్చరిస్తున్నా.. ప్రధాని మోదీ

పోలీసుల కేసు తరువాత.. పటేరియా స్పందించారు.. నేను గాంధీజీ అనుచరుడిని, గాంధీ అనుచరులు హత్య గురించి మాట్లాడలేరు. వీడియోను తప్పుగా అన్వయించారు అంటూ మరో వీడియోను విడుదల చేశారు. మోడీని రాజకీయంగా చంపాలంటే ప్రజలు ఏకం కావాలని నేను చెప్పాలనుకున్నాను అని అన్నారు. ఇదిలాఉంటే పటేరియా వ్యాఖ్యలు అతని వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. మేము ఏ విధమైన హింసకు మద్దతు ఇవ్వము, ఇది ప్రకటన లేదా మాటల ద్వారా కావచ్చు అంటూ తెలిపారు.