Sachin Pilot : రాజస్థాన్ లో కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ నిరాహార దీక్ష.. సొంత పార్టీ ప్రభుత్వంపైనే నిరసన

మాజీ సీఎం వసుందర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందంటూ సచిన్ పైలెట్ నిరాహార దీక్షకు దిగారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

Sachin Pilot : రాజస్థాన్ లో కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ నిరాహార దీక్ష.. సొంత పార్టీ ప్రభుత్వంపైనే నిరసన

Sachin Pilot

Sachin Pilot : రాజస్థాన్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయాలు విచిత్రంగా మారాయి. సాధారణంగా అధికార పక్షంపై ప్రతిపక్షం.. ప్రతిపక్షంపై అధికార పక్షం నిరసన తెలుపుతాయి. కానీ, రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన కీలక నేత నిరనస చేపట్టారు. జైపూర్ లో కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ ఒక్కరోజు దీక్షకు దిగారు.

మాజీ సీఎం వసుందర రాజే అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విఫలమైందంటూ సచిన్ పైలెట్ నిరాహార దీక్షకు దిగారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే, సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలెట్ నిరసనకు దిగుతున్నారు. గతంలోనూ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ కు మధ్య విభేదాలు ఉన్నాయి.

Khammam constituency politics : ఖమ్మంలో బీఆర్ఎస్ Vs పొంగులేటి పొలిటికల్ ఫైట్.. శీనన్నదారి ఎటు? గులాబీ గూటికా? హస్తం నీడకా?

కాగా, సచిన్ పైలెట్ దీక్ష పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమైన, వ్యతిరేక చర్యగా రాజస్థాన్ ఏఐసీసీ ఇంచార్జ్ సుఖ్జిందర్ సింగ్ రంధావా అభివర్ణించారు. 5 నెలలుగా ఇంచార్జ్ గా ఉన్న తనతో గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని చెప్పలేదని వెల్లడించారు. ప్రభుత్వంతో సమస్యలుంటే మీడియా, ప్రజల ముందు కాకుండా పార్టీ అంతర్గత వేదికల మీద చర్చించాలని హితవు పలికారు.