పాకిస్తాన్‌పై దాడి చేయడం తప్పు : కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా

  • Edited By: veegamteam , March 22, 2019 / 09:27 AM IST
పాకిస్తాన్‌పై దాడి చేయడం తప్పు : కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా

కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని ఆయన అన్నారు. ఎవరో కొంతమంది వచ్చి దాడి చేస్తే దానికి పాకిస్తాన్ లోని వారంతా దోషులే అన్నట్టు వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. కొంతమంది టెర్రరిస్టులు ఉన్నారనే కారణంతో పాకిస్తాన్ ను శిక్షించే అధికారం ఎవరికీ లేదని పిట్రోడా తేల్చి చెప్పారు. పాకిస్తాన్ తో భారత్ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.
Read Also : వీధుల్లో కొట్టుకున్నారు : ఉండిలో టీడీపీ – వైసీపీ రాళ్ల దాడులు

పాక్ భూభాగంలోని జైషే మహమ్మద్ స్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడిలో 300 మంది టెర్రరిస్టులు చనిపోయారు అనే దానిపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. దీనికి సాక్ష్యం ఏమిటో చూపించాలన్నారు. ఓ దేశ పౌరుడిగా ఇందుకు సాక్ష్యం అడిగే హక్కు, వాస్తవాలు తెలుసుకోవాల్సిన హక్కు తనకు ఉందన్నారు. అంతర్జాతీయ మీడియాలో అక్కడ ఎవరూ చనిపోలేదని రాశారని పిట్రోడా అన్నారు. ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయం అని పిట్రోడా అనడం విశేషం.

పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తూ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు బాధాకరం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హస్తం ఉందని తెలిసి కూడా ఇలాంటి మాటలు అనడం దురదృష్టకరం అన్నారు. రాజకీయ లబ్ది కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
Read Also : పోలీసుల షాక్ : ప్రకాష్ రాజ్ నామినేషన్ పై డైలమా