ఢిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ నుంచి రాహుల్ వాకౌట్

ఢిఫెన్స్  పార్లమెంటరీ కమిటీ మీటింగ్ నుంచి రాహుల్ వాకౌట్

Congress members walk out of Defence Parliamentary panel meeting రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇవాళ(డిసెంబర్-16,2020)ఢిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమైన జాతీయ భద్రత ఇష్యూకి బదులుగా భద్రతా దళాల యూనిఫాం గురించి చర్చించడంతో ప్యానల్ సమయం వృద్ధా అవుతుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు కమిటీ మీటింగ్ నుంచి వెళ్లిపోయారని సమాచారం.

త్రిదళాధిపతి బిపిన్ రావత్ సమక్షంలో పాన్యల్ చెర్మన్ జౌల్ ఓరమ్(బీజేపీ) అధ్యక్షతన జరిన మీటింగ్ సమయంలో ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్స్ ఇష్యూ గురించి చర్చ జరుగుతుండగా రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని.. లడఖ్ బోర్డర్ లో చైనా దురాక్రమణ,సైనికులకు మెరుగైన ఆయుధ మరియు సౌకర్యాల విషయంపై చర్చిద్దామని రాహుల్ వ్యాఖ్యానించాడని…దీంతో రాహుల్ ని మాట్లాడేందుకు అనుమతివ్వకపోవడంతో ఆయనతోపాటు కమిటీలోని కాంగ్రెస్ నాయకులు కూడా వాకౌట్ చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

అయితే, తమకు ఏ కలర్ యూనిఫాం ఉండాలి అనే విషయాన్ని ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ నిర్ణయించుకోవాలని,రాజకీయనాయకులు నిర్ణయించకూడదని రాహుల్ గాంధీ తెలిపారు. దానికి బదులుగా రాజకీయ నాయకత్వం..లఢఖ్ లో చైనాతో పోరాడుతున్న ధైర్యవంతులైన సైనికులకు హాట్ టెంట్స్,బూట్లు,అవసరమైన ఆయుధాలు అందించాలని మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడినట్లు సమాచారం. ఏ విధంగా శత్రువుని వెనక్కి తరిమికొట్టాలనేదానిపై రాజకీయనాయకత్వం దృష్టి పెట్టాలని, యూనిఫాం కలర్ విషయంలో ఆదేశించడానికి బదులుగా భద్రతా దళాలను బలోపేతం చేయాలని రాహుల్ పేర్కొన్నారు.

రాహుల్ వ్యాఖ్యలతో మీటింగ్ వాగ్వాదం తతెత్తింది. రాహుల్ ని మాట్లాడనీయకుండా కమిటీ చైర్మన్ అడ్డుకున్నారు. దీంతో రాహుల్ వాకౌట్ చేశారు. రాహుల్ తో పాటు కమిటీ మీటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి,రాజీవ్ సతవ్ కూడా వాకౌట్ చేశారు. కాగా, చైనా దురాక్రమణ ఇష్యూపై కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే,రాహుల్ ఆరోపణలను బీజేపీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.