Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్‭లో తిరుగుబాటు లేసిందా? కొత్త చిక్కులు తెస్తున్న మంత్రివర్గ విస్తరణ

మా బంజారా సంఘం నాయకుడు రుద్రప్ప లమాని పేరు నిన్న రాత్రి వరకు లిస్ట్‌లో ఉంది. కానీ ఈ రోజు అతని పేరు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మేము మా 75% ఓట్లు ఇచ్చాము. మా నాయకుడికి మంత్రి పదవి రాకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాము. మా తరపున ఒక నాయకుడు మంత్రివర్గంలో ఉండాలి” అని మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు

Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్‭లో తిరుగుబాటు లేసిందా? కొత్త చిక్కులు తెస్తున్న మంత్రివర్గ విస్తరణ

Congress ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠను దాటి వారం రోజుల అనంతరం ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పడింది. అయితే ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లేస్తోందా అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు. 24 మంది కొత్త ఎమ్మెల్యేలతో శనివారం బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే కాంగ్రెస్ మేడకు ఉచ్చులా కానుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Karnataka: ఆర్ఎస్ఎస్‭ను టచ్ చేస్తే కాంగ్రెస్ బూడిదేనట.. కర్ణాటక బీజేపీ చీఫ్ వార్నింగ్

మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రుద్రప్ప లమాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఆయన తన అనుచరులతో కలిసి శనివారం బెంగళూరులోకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గిరిజన నేత అయిన లమానికి మద్దతుగా బంజారా సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నాయకుడికి తోడు జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవాడి వంటి నేతలు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Hyderabad : మహిళలూ.. జాబ్ అవసరమా? లిటరసీ హౌస్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకోండి..

“మా బంజారా సంఘం నాయకుడు రుద్రప్ప లమాని పేరు నిన్న రాత్రి వరకు లిస్ట్‌లో ఉంది. కానీ ఈ రోజు అతని పేరు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మేము మా 75% ఓట్లు ఇచ్చాము. మా నాయకుడికి మంత్రి పదవి రాకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాము. మా తరపున ఒక నాయకుడు మంత్రివర్గంలో ఉండాలి” అని మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. రుద్రప్ప మణప్ప లమాని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హవేరీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మూడు రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. అనంతరం డి.సుధాకర్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇదే కోవలో లమాని మద్దతుదారులు వ్యవహరిస్తున్నారు.

Arvind Kejriwal: ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం: హైదరాబాద్‌లో కేజ్రీవాల్

కర్ణాటక ప్రభుత్వంలో మొత్తం 34 మంది మంత్రులు ఉండవచ్చు. వీరిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్‌తో సహా పది మంది మే 20న ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేల జాబితాలో దినేష్ గుండూరావు, కృష్ణ బైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, రహీం ఖాన్, సంతోష్ లాడ్, కెఎన్ రాజన్న, కె వెంటకేశ్, హెచ్‌సి మహదేవప్ప, బైరతి సురేష్, శివరాజ్ తంగడి, ఆర్‌బి తిమ్మాపూర్, బి నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్ ఉన్నారు. మధు బంగారప్ప, డి సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసీ సుధాకర్ సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్నారు.