ఎప్పుడు చేరిందబ్బా: ప్రియాంక చోప్రాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జిందాబాద్

ఎప్పుడు చేరిందబ్బా: ప్రియాంక చోప్రాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జిందాబాద్

కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ ఆదివారం బహరింగ సభలో ప్రియాంక చోప్రాకు జిందాబాద్ కొట్టాడు. పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రియాంక గాంధీ వాద్రా అనడానికి బదులు ప్రియాంక చోప్రా అంటూ జేజేలు కొట్టాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. 

సోనియా గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, ప్రియాంక చోప్రా జిందాబాద్ అంటూ చేసిన కామెంట్లు వైరల్ కావడంతో ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పుకున్నాడు. 2017ఎన్నికల్లో సురేంద్ర కుమార్ ఆప్ ఎమ్మెల్యే రామచందర్ చేతిలో ఓటమి ఎదుర్కొన్నాడు. 

ఆలోగా అకాలీ దళ నాయకుడు, రాజౌరీ గార్డెన్ ఎమ్మెల్యే మంజీదర్ సింగ్ సిర్సా కాంగ్రెస్ లీడర్ పై విమర్శలు గుప్పించాడు. ‘కాంగ్రెస్ సభలోనే ప్రియాంక చోప్రాను పొగుడుతున్నాడు. దీనిని బట్టే తెలుస్తుంది మొత్తం పార్టీనే పప్పు అని’ అంటూ కామెంట్లు చేశాడు. రాజకీయ నాయకుడిని ఆడుకునే అవకాశం దొరికడంతో నెటిజన్లు ట్వీట్లతో ఆడుకుంటున్నారు.