Bharat Jodo Yatra: స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ

పున్నమాడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ పాల్గొన్నారు. రేసర్ల మధ్యలో కూర్చొని బోటులో ప్రయాణించారు. ఈ విషయమై రేసర్లు స్పందిస్తూ తమకు రాహుల్ తమకు మరింత ఉత్సహాన్ని ఇచ్చి క్రీడా స్ఫూర్తిని పెంపొందించారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bharat Jodo Yatra: స్నేక్ బోట్ రేసులో పాల్గొన్న రాహుల్ గాంధీ

Congress MP Rahul Gandhi participates in a snake boat race

Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా.. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని పున్నమాడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ పాల్గొన్నారు. రేసర్ల మధ్యలో కూర్చొని బోటులో ప్రయాణించారు. ఈ విషయమై రేసర్లు స్పందిస్తూ తమకు రాహుల్ తమకు మరింత ఉత్సహాన్ని ఇచ్చి క్రీడా స్ఫూర్తిని పెంపొందించారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పాదయాత్ర ప్రారంబించి నేటికి 11వ రోజులు పూర్తైంది. కాగా, సోమవారం అలప్పుజలోని పున్నప్రా అరవుకడ్‌లో ‘భారత్ జోడో యాత్ర’ 12వ రోజుకు ప్రారంభం పలికారు. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట కాంగ్రెస్ శ్రేణులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర సందర్భంగా దారిపొడవునా నిలుచున్న ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. ఇదిలా ఉంటే పాదయాత్ర కంటే ముందు ఉదయం 6:00 గంటలకు రాహుల్ గాంధీ అలప్పుజాలోని వడకల్ బీచ్‌లో మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఉదయాన్నే జరిగిన ఈ సమావేశంలో పెరుగుతున్నఇంధన ధరలు, తగ్గిన సబ్సిడీలు, పర్యావరణ విధ్వంసం వంటి పలు సమస్యలపై రాహుల్ వారితో చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఉదయం 6.30గంటలకు పున్నప్రా అరవుకడ్‌లో ప్రారంభమైన పాదయాత్ర 16 కిలోమీటర్ల మేరసాగి ఉదయం 11గంటలకు కలవూరుకు చేరుకుంటుంది. అక్కడ రాహుల్ విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయంలో పలు వర్గాలవారితో రాహుల్ సమావేశం అవుతారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు యాత్ర కలవూరు జంక్షన్ వద్ద పునఃప్రారంభం అవుతుంది. తొమ్మిది కిలో మీటర్ల పాదయాత్ర అనంతరం రాత్రి 7గంటలకు చేర్యాల సమీపంలోని మాయితర వద్ద 12వ రోజు పాదయాత్ర పూర్తవుతుంది. రాత్రి అక్కడే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు బస చేస్తారు.

Sukhbir Singh Badal: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‭పై మళ్లీ ఊపందుకున్న తాగుబోతు ఆరోపణలు.. టార్గెట్ చేసిన అకాలీ దళ్ చీఫ్