MP Shashi Tharoor: కదలలేని స్థితిలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ .. ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేసిన ఎంపీ

ఎప్పుడూ ట్విటర్‌లో, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కదలలేని స్థితిలో మంచంపై కనిపించారు. శుక్రవారం తన ట్విటర్ ఖాతా వేదికగా శశిథరూర్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు.

MP Shashi Tharoor: కదలలేని స్థితిలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ .. ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేసిన ఎంపీ

Shashi Tharoor

MP Shashi Tharoor: ఎప్పుడూ ట్విటర్‌లో, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా ఉండే కాంగ్రెస్ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కదలలేని స్థితిలో మంచంపై కనిపించారు. శుక్రవారం తన ట్విటర్ ఖాతా వేదికగా శశిథరూర్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు. ఫొటోలో తన ఎడమ కాలుకు కట్టుకట్టినట్లు ఉంది. ఈ విషయాన్ని శశిథరూర్ వివరించారు. పార్లమెంట్ భవనం మెంట్లపై నుంచి  దిగుతున్న క్రమంలో కాలుజారడంతో బెణికింది.

Shashi Tharoor: శశి థరూర్‌కు కాంగ్రెస్ షాక్.. గుజరాత్ ప్రచారకర్తల జాబితాలో దక్కని చోటు

కాలు బెణకడంతో తొలుత పట్టించుకోకుండా అలానే నడవడంతో నొప్పి తీవ్రమైంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లడం జరిగిందని, వైద్యులు తన కాలు పాదంకు బ్యాండేజ్ చేశారని, ప్రస్తుతం నేను ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. దీంతో శుక్రవారం పార్లమెంట్‌కు రాలేక పోయానని, అదేవిధంగా తన పార్లమెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో సైతం పాల్గొనలేక వాయిదా వేసుకోవటం జరిగిందని శశిథరూర్ ట్విటర్ వేదికగా తెలిపారు.

ఇదిలాఉంటే నిన్న శశిథరూర్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. తవాంగ్ విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తవాంగ్ విషయంలో ఎలాంటి వివరణ లేకుండా ఒక చిన్న ప్రకటన చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి విషయాల్లో ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని అన్నారు. ఇదిలాఉంటే శశిథరూర్ మరో రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది.