Amit Shah: సీపీఎంతో జట్టు కట్టడం కాంగ్రెస్‌కు సిగ్గు చేటు: కేంద్ర మంత్రి అమిత్ షా

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎం)తో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఎందుకంటే ఎందరో కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపించిన పార్టీ సీపీఐ (ఎం). అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కట్టిందంటేనే ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుందని అర్థం.

Amit Shah: సీపీఎంతో జట్టు కట్టడం కాంగ్రెస్‌కు సిగ్గు చేటు: కేంద్ర మంత్రి అమిత్ షా

Amit Shah: త్రిపుర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ (ఎం) జట్టు కట్టినందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలని విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. త్రిపురలో ఈ నెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Asian Indoor Championships: ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు.. మహిళా పోల్ వాల్ట్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్

చాందిపూర్‌లో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎం)తో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. ఎందుకంటే ఎందరో కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపించిన పార్టీ సీపీఐ (ఎం). అలాంటి పార్టీతో కాంగ్రెస్ జత కట్టిందంటేనే ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓడిపోబోతుందని అర్థం. వాళ్లకు బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి లేదు. రెండు పార్టీలూ ఇంతకాలం త్రిపురకు చేసిందేమీ లేదు. బీజేపీ పాలనలోనే త్రిపుర అభివృద్ధి చెందింది. అందరి సంక్షేమం కోసం బీజేపీ కృషి చేసింది. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఆదివాసీలకు కూడా ఏమీ చేయలేదు.

US fighter jet: కెనడా గగనతలంపై గుర్తు తెలియని వస్తువును పేల్చివేసిన అమెరికా విమానం

కానీ, వాళ్ల ఓట్ల కోసం ఆదివాసిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాయి’’ అని అమిత్ షా విమర్శించారు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో ఈ నెల 16న ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. మాణిక్ సాహా సీఎంగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ అక్కడ రెండు ర్యాలీలు నిర్వహించారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పర్యటిస్తున్నారు.