Rahul Gandhi Comments : కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాహుల్ కీలక వ్యాఖ్యలు.. ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం

లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. తన ఫోన్ రికార్డ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు.

Rahul Gandhi Comments : కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాహుల్ కీలక వ్యాఖ్యలు.. ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం

RAHUL

Rahul Gandhi Comments : లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. తన ఫోన్ రికార్డ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు. తనపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. విపక్షాలకు నిరంతరం ఒత్తిడి ఉంటుందన్నారు.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పై రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సంద్భంగా రాహుల్ భారత్ లో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ తీరుపై వ్యాఖ్యలు చేశారు. తనతో సహా దేశంలోని ప్రతిపక్ష నేతలపై నిఘా కోసం పెగాసస్ ను వినియోగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఇప్పటికీ భారత్ లో చాలా మంది రాజకీయ నేతల ఫోన్లలో పెగాసస్ ఉందని తెలిపారు.

Rahul Gandhi on Savarkar: సావర్కర్ భావజాలంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఇంటెలిజెన్స్ అధికారులే స్వయంగా ఫోన్ చేసి ట్యాపింగ్ గురించి తనను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.