PM Modi : కాంగ్రెస్ పై మోదీ ఫైర్..ఇంకా అదే కోమాలో ఉన్నారు

కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ.

PM Modi : కాంగ్రెస్ పై మోదీ ఫైర్..ఇంకా అదే కోమాలో ఉన్నారు

Congress On The Decline But Still Concerned About Us: PM Modi Attack:  కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. బీజేపీ అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని మోదీ అన్నారు. అసోం,బెంగాల్,కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వత కూడా కాంగ్రెస్ తన కోమా నుంచి బయటకు రాలేదని విమర్శించారు.

మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ..కాంగ్రెస్ పార్టీ కనీసం విపక్ష పాత్రను సైతం సరిగ్గా నిర్వహించలేకపోతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉన్న నిజమైన సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉన్నా.. విపక్షంగా కాంగ్రెస్ ఆ పనిచేయడం లేదన్నారు. అధికారానికి తామే అర్హులమని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు. ప్రజల తీర్పుని కాంగ్రెస్ పట్టించుకోదన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తోందని కానీ ఇప్పటికీ తన కన్నా బీజేపీ గురించే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఆందోళన చెందుతోందన్నారు. దేశంలో ప్రతికూల వాతావరణాన్ని(negative atmosphere) సృష్టిస్తుందని,వాస్తవంలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరతే లేదని మోదీ అన్నారు.

కరోనా మహమ్మారి రాజకీయ సమస్య కాదని, మానవతా సమస్య అని ప్రధాని పేర్కొన్నారు. కరోనా సమయంలో దేశంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.
ప్రభుత్వం చేసిన పనుల గురించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచి..కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే అసత్యాలను తిప్పికొట్టాలని బీజేపీ ఎంపీలకు మోదీ నిర్దేశించారు. సమాచార లోపం వల్ల విపక్షాల అసత్యాలు ప్రచారం కాకుండా చూసుకోవాలని తెలిపారు. కోవిడ్ పై పోరాటంలో విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ నెల 24,25 తేదీల్లో ఉచిత రేషణ్ పంపీణ జరగనున్న సమయంలో రేషన్ దుకాణాల వద్దకు వెళ్లాలని బీజేపీ నేతలకు మోదీ సూచించారు.

కరోనా వ్యాప్తి మూడో దశ విషయంలో ఎంపీలంతా అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవాంతరాలు లేకుండా తమతమ నియోజకవర్గాల్లో వ్యాక్సినేషన్ కొనసాగేలా చూసుకోవాలని చెప్పారు.మరోవైపు, పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.