Congress president Election : కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కోసం త్వరలోనే ఎన్నికలు..

కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు కోసం పార్టీ అధిష్టానం ఎన్నిక నిర్వహించబోతోంది. దీని కోసం ఎన్నిక ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 లోపు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలు పూర్తి అయితే సెప్టెంబరు మొదటి వారంలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త సారధి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

Congress president Election : కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కోసం త్వరలోనే ఎన్నికలు..

Election for select congress New president start

Election for select congress New president start : కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు కోసం పార్టీ అధిష్టానం ఎన్నిక నిర్వహించబోతోంది. దీని కోసం ఎన్నిక ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 లోపు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలు పూర్తి అయితే సెప్టెంబరు మొదటి వారంలో కాంగ్రెస్‌ పార్టీ కొత్త సారధి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ తేదీని నిర్ణయించేందుకు సీడబ్ల్యూసీ త్వరలో భేటీ కానుంది.

కాగా సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టబోతోంది. 3500 కి.మీటర్లు సాగే ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు అంతా పాల్గొననున్నారు. కాంగ్రెస్ పాదయాత్ర ప్రారంభం కంటే ముందే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ భావిస్తోంది. దీని కోసం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20లోపు ఈ ఎన్నిక పూర్తికానుంది.
అందుకు అనుగుణంగా… సీడబ్ల్యూసీ లో షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో పాటు పాదయాత్ర రూట్ మ్యాప్ కు కూడా తుదిరూపు ఇవ్వనున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు పూర్తి అయిన తరువాత పార్టీ వర్కింగ్ కమిటీ, ఇతర పార్టీ పోస్టులకు ఎన్నికలు జరుగనున్నట్లుగా తెలుస్తోంది.

కాగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక అనే అంశం కొన్ని సంవత్సరాలుగా నానుతూనే ఉన్నది. కానీ.. ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. తరుచూ సీడబ్ల్యూసీలో ఈ అంశంపై చర్చించడం, ఎన్నిక నిర్వహణను మరికొన్ని నెలలు వాయిదా వేయటం జరుగోతంది. ఈక్రమంలో ఎట్టకేలకు ఈ ఎన్నికను ఖరారు చేసింది అధిష్టానం. ఆగస్టు 21వ తేదీ నుంచి కాంగ్రెస్ చీఫ్ ఎంపిక కోసం ఎన్నికలు జరుతాయని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ సారైనా రాహుల్ గాంధీ సరేనంటారా? లేదా గతంలో వలెనే వెనుకంజ వేస్తారా? అనేదే ప్రశ్న కాంగ్రెస్ శ్రేణులతో సహా సామాన్యులకు వస్తున్న ప్రశ్న.

కాంగ్రెస్ చీఫ్‌గా గాంధీయేతర వ్యక్తిని నియమించాలనే అంశంపైనా ఈ పార్టీ చాన్నాళ్లుగా చర్చ కొనసాగుతోంది. కానీ దీనిపై ఏకాభిప్రాయం మాత్రం రావటంలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా గాంధీ యేతర వ్యక్తులే పార్టీ అధ్యక్షులు అయితే బాగుంటుందని ప్రతిపాదనను సోనియా గాంధీ దృష్టికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌లోని చాలా మంది నేతలకకు గాంధీలే నాయకత్వం వహించాలనే అభిప్రాయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వర్గపోరులతో అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్‌ను ఐక్యం చేయడానికి గాంధీలకు మాత్రమే సాధ్యం అవుతుందనే అభిప్రాయాలు వారిలో ఉన్నాట్లుగా తెలుస్తోంది. అధ్యక్ష ఎంపికకు ఎన్నికలు పూర్తయితే.. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి, ఇతర పార్టీ పోస్టులకూ ఎన్నికలు జరుగుతాయని కూడా తెలుస్తోంది.

రాహుల్ గాంధీ 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ.. జనరల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. 543 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ కేవలం 52 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ దారుణ వైఫల్యాన్ని బాధ్యతగా తీసుకుంటూ రాహుల్ గాంధీ 2019 మే నెలలో రాజీనామా చేశారు. ఆ తర్వాత అనివార్యంగా సోనియా గాంధీ పార్టీ పగ్గాలు పట్టారు. ఇప్పటికీ ఆమె మధ్యంతర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అవుతారు అనే విషయంపై ఆసక్తి కొనసాగుతోంది.