Mallikarjun kharge: ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ..

ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారంకు డిమాండ్ చేశారు.

Mallikarjun kharge: ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ..

PM modi - Mallikarjun Kharge

Mallikarjun kharge: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)  లేఖ రాశారు. పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సిన జనాభా గణన (Population census) ను వెంటనే పూర్తి చేయాలని, కుల గణన (Caste enumeration) ను కూడా జన గణనలో అంతర్భాగంగా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు అనేక సందర్భాల్లో పార్లమెంటు ఉభయ సభలలో ఈ డిమాండ్‌ను లేవనెత్తడం జరిగిందని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.

Karnataka Election 2023: కర్ణాటక ఎన్నికలవేళ బీజేపీకి షాకిచ్చిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..

యూపీఏ ప్రభుత్వం 2011 – 12లో మొదటిసారిగా 25కోట్ల కుటుంబాలకు సామాజిక ఆర్థిక, కుల గణన (SECC) నిర్వహించిందని మీకు తెలుసు అని, 2014 మేలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కుల గణన చేయాలని డిమాండ్ చేసినప్పటికీ కుల డేటాను ప్రచురించలేదని ఖర్గే అన్నారు. తాజా కుల గణన లేనందున అర్థవంతమైన సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాలకు, ముఖ్యంగా OBCలకు చాలా అన్యాయం జరుగుతుందని అన్నారు. అవసరమైన విశ్వసనీయమైన డేటా‌బేస్ అసంపూర్తిగా ఉంటుందని, జనాభా గణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.

PM Modi degree : ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదం, సీఎం కేజ్రీవాల్‌పై గుజరాత్ యూనివర్శిటీ పరువునష్టం దావా..

2021లో సాధారణ దశాబ్ది జనాభా గణనను నిర్వహించాల్సి ఉందని, అయినా, అది ఇంకా నిర్వహించలేదని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. తక్షణమే జన గణన, సమగ్ర కుల గణనను జరపాలని లేఖలో ప్రధాని నరేంద్ర మోదీని ఖర్గే డిమాండ్ చేశారు.