దక్షిణాది నుంచి పోటీకి సై: రాహుల్ రెండవ సీట్ ఫిక్స్

  • Published By: vamsi ,Published On : March 31, 2019 / 06:00 AM IST
దక్షిణాది నుంచి పోటీకి సై: రాహుల్ రెండవ సీట్ ఫిక్స్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వాయినాడ్ లేదా మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్‌లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ అక్కడే విజయం సాధించి తమ సత్తా చూపించటం మంచిది.. దీనికోసం మొత్తం పార్టీ యంత్రాంగమంతా కృషి చేయాలని ఒక వర్గం వాదిస్తుంటే.. రెండో వర్గం మాత్రం రాహుల్ అమేథీతోపాటు వాయినాడ్ లేదా మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయాలని రెండో వర్గం వాదిస్తోంది. అమేథీలో ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఆయన మరో నియోజకవర్గం నుండి కూడా పోటీ చేయటం మంచిదనే వాదన వినిపిస్తోంది.
Read Also : గెలిస్తే ఏం చేస్తానంటే : గాజువాక నియోజకవర్గ జనసేన మేనిఫెస్టో

అమేథీతోపాటు దక్షిణాదిలోని కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోని ఏదో ఒక లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పార్టీ మొదటి నుండి గట్టిగా డిమాండ్‌లు వినిపించాయి. గతంలో ఇందిరా గాంధీ 1980లో రాయబరేలీ నుండి ఓడిపోయిన తరువాత ఎన్నికల్లో ఆమె రాయబరేలీతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ నుండి పోటీ చేసింది. సోనియా గాంధీ 1999లో రాయబరేలీతోపాటు కర్నాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రెండు నియోజకవర్గాల నుండి వారు పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వాయినాడ్ నుంచి రాహుల్‌ని బరిలోకి దించింది కాంగ్రెస్.
Read Also : రాహుల్ పీఎం కాగానే భార్యకు భరణం ఇస్తా : కోర్టులో భర్త వాదన