Karnataka Congress: కర్ణాటకలో నిరుద్యోగ భృతి.. ‘యువ నిధి’ పేరుతో ప్రతి నెలా రూ.3,000 ఇస్తామని కాంగ్రెస్ హామీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బెల్గాంలో ‘యువ క్రాంతి సమావేశ’ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్, సీఎల్పీ నేత సిద్ధ రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువతకు కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చింది.

Karnataka Congress: కర్ణాటకలో నిరుద్యోగ భృతి.. ‘యువ నిధి’ పేరుతో ప్రతి నెలా రూ.3,000 ఇస్తామని కాంగ్రెస్ హామీ

Karnataka Congress: కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే హామీలు గుప్పిస్తున్నాయి. తాజాగా నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ‘యువ నిధి’ పేరుతో కర్ణాటక నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.3,000 వరకు అందజేస్తామని హామీ ఇచ్చింది.

Video Games: అదేపనిగా మొబైల్‌లో గేమ్స్ ఆడుతున్న కొడుకు.. తండ్రి వేసిన శిక్షేంటో తెలుసా?

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బెల్గాంలో ‘యువ క్రాంతి సమావేశ’ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్, సీఎల్పీ నేత సిద్ధ రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువతకు కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ‘యువ నిధి’ పేరుతో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన వారికి ప్రతి నెలా రూ.3,000, డిప్లొమా కలిగిన వారికి ప్రతి నెలా రూ.1,500 అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి నిరుద్యోగికి గరిష్టంగా 24 నెలలపాటు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.

Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!

అలాగే ‘గృహ జ్యోతి’ పేరుతో మరో పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. దీని ప్రకారం.. ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. ‘గృహ లక్ష్మి’ పేరుతో మరో పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం ప్రతి గృహిణికి నెలనెలా రూ.2,000 అందిస్తారు. అలాగే ‘అన్న భాగ్య’ కింద కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పది కిలోల బియ్యం అందిస్తారు. రాష్ట్రంలో లక్ష మంది యువ ఓటర్లు ఉన్నారు. వీళ్లను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ‘యువ నిధి’ పథకాన్ని తీసుకొచ్చింది. తాజా కార్యక్రమం జరిగిన బెలగావి జిల్లాలో 18 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందుకే ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు.