Congress Protest : కాంగ్రెస్ నిరసనల్లో అపశ్రుతి.. కుప్పకూలిన ఎద్దులబండి

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పార్టీలు గత కొద్దీ రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు తృణమూల్ నేతలు రోడ్లపైకి వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలియచేస్తున్నారు.

Congress Protest :  కాంగ్రెస్ నిరసనల్లో అపశ్రుతి.. కుప్పకూలిన ఎద్దులబండి

Congress Protest

Congress Protest : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పార్టీలు గత కొద్దీ రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు తృణమూల్ నేతలు రోడ్లపైకి వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలియచేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ముంబైలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్‌తప్ ఆధ్వర్యంలో ఎద్దులబండిపై వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలోనే ఒకరివెంట వరకు ఎద్దులబండి ఎక్కడంతో బరువు ఎక్కువై విరిగిపోయింది. దీంతో ఎద్దులబండిపై ఉన్న కాంగ్రెస్ నేతలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో నిరసన కార్యక్రమం అర్ధాంతరంగా ముగిసింది.

మరోవైపు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.100 దాటింది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ. 105 రూపాయలకు చేరింది. ఆంధ్రాలో కొన్ని చోట్ల పెట్రోల్ ధర రూ.107 రూపాయలకు చేరింది. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక డీజిల్ ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ ధరలు పెరుగుదల ప్రభావం రైతులపై అధికంగా పడుతుంది. పోలంపనులకు యంత్రాల వాడకం తప్పనిసరిగా మారిన ఈ రోజుల్లో డీజిల్ ధరల పెరుగుదల రైతులను కలవరపాటుకు గురిచేస్తుంది.