ఎన్నికల సైరన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల

  • Published By: madhu ,Published On : September 11, 2020 / 03:29 PM IST
ఎన్నికల సైరన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.



అభ్యర్థులు :
రవీంద్ర సింగ్ తోమర్, సత్యప్రకాశ్, మేవరమ్ జతావ్, సునీల్ శర్మ, సురేశ్ రాజే, ఫూల్ సింగ్, ప్రగిలాల్, కన్హయ్యలాల్ అగర్వాల్, ఆశ్రా దోహ్రే, విశ్వనాథ్ సింగ్ కుంజన్, మదన్ లాల్ చౌదరి, విపిన్ వాఖండే, రజ్వీర్ సింగ్, రమేశ్ కిషన్ పటేల్, ప్రేమ్ చంద్ గుడ్డు.



మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా అప్పటి ముఖ్యమంత్రి కమల్ నాథ్ ల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ సరసన చేరిపోయారు. రాజ్యసభకు ఈయన ఎన్నికయ్యారు. మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.
https://10tv.in/speaking-loudly-could-also-help-spread-coronavirus-hp-assembly-speaker-to-mlas/
27 శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను సింధియా, కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.