Facebook Influencing Polls : దేశ ఎన్నికల్లో ఫేస్ బుక్ జోక్యంపై జేఏపీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్

భారతదేశంలో జరిగే ఎన్నికలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరోపించింది. భారత ఎన్నికలను ఫేస్​బుక్​ ప్రభావిత

10TV Telugu News

Facebook Influencing Polls భారతదేశంలో జరిగే ఎన్నికలను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరోపించింది. భారత ఎన్నికలను ఫేస్​బుక్​ ప్రభావితం చేస్తోందన్న అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్​ చేసింది.

ఫేస్​బుక్​ తనను తాను ఫేక్​బుక్​గా దిగజార్చుకుందని కాంగ్రెస్​ ప్రతినిధి పవన్​ ఖేరా తెలిపారు. భారత్​లో తమ ఫ్లాట్​ఫామ్​ వేదికగా చేస్తున్న విద్వేషపూరిత ప్రకటనలను అడ్డుకోవటంలో ఫేస్​బుక్​ విఫలమైందన్న పలు అంతర్జాతీయ నివేదికలను ప్రస్తావిస్తూ ఖేరా ఈ వ్యాఖ్యలు చేశారు.

అధికార బీజేపీకి ఫేస్​బుక్​ భాగస్వామ్య వ్యవస్థగా వ్యవహరిస్తూ ఆ పార్టీ అజెండాను ప్రచారం చేస్తోంది. లక్షల సంఖ్యలో పోస్టులతో కూడిన నకిలీ ఖాతాలు ఉన్నట్లు ఫేస్​బుక్​ రీసెర్చ్ డాక్యుమెంట్స్ చెబుతున్నప్పటికీ ఇప్పటికీ వాటిపై సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఫేస్​బుక్​ వ్యవస్థలోకి బీజేపీ కార్యకర్తలు చొరబడి దాని పనితీరునే మార్చేస్తున్నారన్నారు. నకిలీ పోస్టులు, కథనాల ద్వారా ఒక నిర్దిష్ట భావజాలాన్ని ప్రోత్సహించడానికి ఫేస్​బుక్​కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు.

ఢిల్లీ అల్లర్లు బంగాల్​ ఎన్నికల సమయంలో ఫేస్​బుక్​ పనితీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. తమ అజెండాకు అనుగుణంగా నడుచుకుంటున్నందుకే.. ఎన్నికల్లో ఫేస్​బుక్​ జోక్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలపై ఫేస్​బుక్​ ఇండియా ఇప్పటివరకు స్పందించలేదు.

ALSO READ UP Election : యూపీలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..టీఎంసీలో చేరిన మాజీ సీఎం మనువళ్లు