Congress: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారీ ఆందోళన

పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్‭ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడానికి ప్రయత్నిస్తోంది. ‘‘మహంగాయి పర్ హల్లా బోల్’’(ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి) అనే హ్యాష్‭ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‭ను కుదిపివేస్తోంది

Congress: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారీ ఆందోళన

Congress stage protest across the country

Congress: దేశంలో పెరిగిన నిరుద్యోగం, ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుతో శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాయి. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు నిరసనకు దిగగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ చేపట్టిన నిరసన మరో మలుపు తీసుకుంది. ధరల పెరుగుదలతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‭ను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పంజాబ్ నుంచి కేరళ వరకు గుజరాత్ నుంచి అస్సాం వరకు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి మోదీ ప్రభుత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వీరి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పంజాబ్ రాజధాని చండీగఢ్‭లో నిరసన చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. కేరళలో పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. అస్సాంలో సైతం కాంగ్రెస్ నేతలపై స్వల్పంగా లాఠీ చార్జ్ జరిగినట్లు కాంగ్రెస్ నేతల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శశి థరూర్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిరసన ఉద్రిక్తం అయింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. రాజ్ భవన్‭కు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతల ఆందోళనతో రాజ్యసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. నల్ల దుస్తులతో వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు ధరల పెరుగుదలను నిరుద్యోగాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సీడబ్ల్యూసీ ప్రధానమంత్రి నివాసాన్ని ఘెరావ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్‭ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడానికి ప్రయత్నిస్తోంది. ‘‘మహంగాయి పర్ హల్లా బోల్’’(ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి) అనే హ్యాష్‭ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‭ను కుదిపివేస్తోంది. ఈ హ్యాష్‭ట్యాగ్‭ను ఉపయోగిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.