Egg Attack : ఎంపీకి చేదు అనుభవం.. వాహనంపై కోడిగుడ్లతో దాడి.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడిని మరువకముందే.. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీపై కోడిగుడ్ల దాడి జరిగింది.

10TV Telugu News

Egg Attack :  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడిని మరువకముందే.. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీపై కోడిగుడ్ల దాడి జరిగింది. కాంగ్రెస్ మద్దతుదారులు బీజేపీ ఎంపీ అపరాజిత సారాంగిని కాన్వాయ్‌ని టార్గెట్‌గా చేసుకుని కోడిగుడ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం భువనేశ్వర్‌ బనమలిపూర్‌లో చోటు చేసుకుంది. నిరుద్యోగం, నిత్యసరాల ధరలు, ఇంధన ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఎంపీ అపరాజిత సారంగి వాహాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ మద్దతుదారులు.. అనంతరం ఆమె వాహనంపై కోడిగుడ్లతోదాడి చేసి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.

చదవండి : Odisha CM Convoy : ఒడిషా సీఎం కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి

ఈ క్రమంలో జరిగిన సంఘటన గురించి అపరాజిత సారంగి తన స్వస్థలం ధనేశ్వర్‌ బారిక్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనకారుల రాళ్లు కోడిగుడ్లతో తన వాహనంపై దాడి చేశారని.. వారివద్ద మారణాయుధాలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొంది ఎంపీ. ఈ క్రమంలో పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

చదవండి : మాస్క్ కట్టుకోకుండా సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీకి జరిమానా