Congrees New President: కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకా? అశోక్ గహ్లోత్‌కా? అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. రాహుల్ కోసం నేతల పట్టు..

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న ఈ పదవికోసం పోలింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమీరా అంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానంకోసం ప్రియాంక, అశోక్ గెహ్లోత్ పేర్లు తెరపైకి వచ్చాయి.

Congrees New President: కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకా? అశోక్ గహ్లోత్‌కా? అధ్యక్ష ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. రాహుల్  కోసం నేతల పట్టు..

congress party

Congrees New President: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న ఈ పదవికోసం పోలింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో షెడ్యూల్ ను ఏకగ్రీవంగా ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా పీసీసీ ప్రధాన కార్యాలయాల్లో పోలింగ్ జరుగుతుందని, సుమారు తొమ్మిదివేల మంది ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ మిస్త్రీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ లు తెలిపారు.

Congress President: అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక

కొత్తకాలంగా కాంగ్రెస్‌లో పార్టీ జాతీయ అధ్యక్ష స్థానంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకావడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాహుల్ గాంధీని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు ఒత్తిడి తెస్తున్నప్పటికీ రాహుల్ ససేమీరా అన్నారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి వేరేవారిని ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధమైంది.

Congress chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకువస్తాం: మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికోసం పలు పేర్లు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ రాహుల్ ససేమీరా అంటున్నారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ అనారోగ్య కారణాల నిమిత్తం అధ్యక్ష పీఠానికి దూరంగా ఉంటానని ప్రకటించడంతో.. గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అయితే ప్రియాంకకు బదులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సోనియా సుముఖంగా ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గహ్లోత్ తొలినుంచి గాంధీ కుటుంబానికి దగ్గరి వ్యక్తిగా ఉన్నారు. దీనికితోడు అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో పార్టీ పగ్గాలు గాంధీయేతర కుటుంబానికి అప్పగిస్తేనే మేలన్న ఆలోచనకు సోనియా వచ్చినట్లు సమాచారం.