Congress New Chief : కాంగ్రెస్‌కి కొత్త అధ్యక్షుడు.. 16న కీలక భేటీ

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? పార్టీ పగ్గాలను రాహుల్‌ గాంధీకి అప్పగిస్తారా? వచ్చే ఏడాది పంజాబ్‌, యూపీ సహా పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏంటి? దీనికి స

Congress New Chief : కాంగ్రెస్‌కి కొత్త అధ్యక్షుడు.. 16న కీలక భేటీ

Congress New Chief

Congress New Chief : కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? పార్టీ పగ్గాలను రాహుల్‌ గాంధీకి అప్పగిస్తారా? వచ్చే ఏడాది పంజాబ్‌, యూపీ సహా పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏంటి? దీనికి సంబంధించి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. అవును, కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణయాక మండలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఈ నెల 16న కీలక భేటీ కానుంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు ఈ భేటీ ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు.

East Godavari : ఆ గ్రామంలో ఏం జరుగుతోంది ? ఆగని మరణాలు

పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా ఈ భేటీలో చర్చించే చాన్సుంది. ముఖ్యంగా పంజాబ్‌ పరిణామాలపై ఇటీవల జీ-23గా చెప్పే కాంగ్రెస్‌ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు అధిష్ఠానంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. సీడబ్ల్యూసీ భేటీ గురించి పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇకపోతే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కంటిన్యూ అవుతున్నారు. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో పార్టీలో డిమాండ్లు ఉన్నాయి. పార్టీ పగ్గాలను రాహుల్‌ గాంధీకి అప్పగించాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఈ అంశంపైనా ప్రధానంగా చర్చించే చాన్సుంది. అలాగే వచ్చే ఏడాది పంజాబ్‌, యూపీ సహా పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

Air Conditioners : ఏసీల వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..

పంజాబ్ లో నాయకత్వ మార్పిడి జరిగింది. ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో తొలిసారిగా దళిత సామాజికవర్గానికి చెందిన చరణ్ జీత్ చన్నీని కాంగ్రెస్ హైకమాండ్ పంజాబ్ సీఎంగా చేసింది. కాంగ్రెస్ కి అధ్యక్షుడు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్. కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు? ఏమైనా సమస్య వస్తే పరిష్కరించే వారు ఎవరు? అసలు పార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదు? అని సీనియర్ నేత కపిల్ సిబల్ వాపోవడం చర్చనీయాంశంగా మారింది. ముందుండి పార్టీని నడిపించే బలమైన నాయకుడు కాంగ్రెస్ కు లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది.

పంజాబ్‌లో పీసీసీ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్దూ రాజీనామా, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్రమంత్రి అమిత్ షా‌తో భేటీ అవడం తదితర పరిణామాల నేపథ్యంలో కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ‘ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షులు లేరు. మరి నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు.. మాకైతే ఆ విషయం తెలియదు.. మేం జీ-23 నేతలమే.. కానీ, జీహుజూర్ 23 నేతలం కాదు.. సమస్యలు, లోపాలను ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని సిబల్ అన్నారు.

పార్టీ వెంటనే కార్యనిర్వాహక కమిటీ (CWC) సమావేశాన్ని ఏర్పాటు చేసి, నిర్ణయాలపై బహిరంగంగా చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలు ఢిల్లీలోని జోర్‌బాగ్‌లోని సిబల్‌ ఇంటి ఎదుట నిరసనకు దిగారు. ఆయన ఇంటిపై టమాటాలు విసిరారు. కారును సైతం ధ్వంసం చేశారు. ‘గెట్‌ వెల్‌ సూన్‌ కపిల్‌ సిబల్‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ దాడిని ఆ పార్టీ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మతో పాటు పలువురు జీ-23 (గ్రూప్‌ ఆఫ్‌ 23) నేతలు ఖండించారు.

మరోవైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు అప్పుడే హీట్ పెంచాయి. ఇప్పటికే యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న ప్రియాంక గాంధీ బీజేపీపై దాడి మొదలు పెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. 16న జరిగే భేటీలో అనేక అంశాలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.