Maharashtra : మహారాష్ట్ర.. కాంగ్రెస్ VS శివసేన మాటల యుద్ధం

మహారాష్ట్ర ప్రతిష్ట, పార్టీ ఉనికి కోసం శివసేన పోరాడుతూనే ఉంటుందని అన్నారు రౌత్. ఇక ఇదిలా ఉంటే శనివారం శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, పార్టీ పేరు, వ్యక్తి పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు.

Maharashtra : మహారాష్ట్ర.. కాంగ్రెస్ VS శివసేన మాటల యుద్ధం

Maharashtra (2)

Maharashtra : మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. శివసేన నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అంటీముట్టనట్లుగా వ్యవరిస్తున్నారు. పలు సందర్భాల్లో సీఎంను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తాము ఒంటరిగా వెళ్తామని తాజాగా ప్రకటించారు నానా పటోలె.

దీనిపై శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. తమ పార్టీ రాజకీయ పోరాటాలను సొంతంగానే చేస్తుందని, ఒంటరిగా పోటీ చేయాలనుకునే పార్టీలు ఆ విధంగానే చేసుకోవచ్చని రౌత్ అన్నారు. ఎన్నికల సందర్బంగా కూటములు ఏర్పడడం సాధారణమైన అంశమే అని, రాజకీయ పోరాటాలు మాత్రం స్వతంత్రంగా ఉంటాయని చెప్పారు.

మహారాష్ట్ర ప్రతిష్ట, పార్టీ ఉనికి కోసం శివసేన పోరాడుతూనే ఉంటుందని అన్నారు రౌత్. ఇక ఇదిలా ఉంటే శనివారం శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, పార్టీ పేరు, వ్యక్తి పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు. ఒంటరిగా వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని తమకు ఎలాంటి అభ్యంతరము లేదని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్లోకి వెళితే ఏం జరుగుతుందో అందరికి తెలుసని కాంగ్రెస్ ను ఉద్దేశిస్తు ఘాటుగా మాట్లాడారు ఉద్దవ్.