CM Bommai: కర్ణాటకలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: సీఎం బసవరాజు బొమ్మై

కర్ణాటకను అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై. త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.

CM Bommai: కర్ణాటకలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: సీఎం బసవరాజు బొమ్మై

CM Bommai: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై. బీజేపీ ఆధ్వర్యంలో కునిగల్ నుంచి చేపట్టిన ‘జన సంకల్ప్ యాత్ర’ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేశారు.

UPSC Mains Results : యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

‘‘కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను అత్యధిక కాలం పాలించింది. అయితే, రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ప్రజల్ని తప్పుదోవపట్టించి మోసం చేసింది. తర్వాత బీజేపీ ప్రత్యామ్నాయంగా మారి, అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ తన స్థానాన్ని కోల్పోయింది. కులాలు, మత విభజన, ఉప కులాల మధ్య గొడవలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకాలు బయటపడుతున్నాయి. పేదల అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్లు, కాంగ్రెస్ లేకపోతే వాళ్లకు రక్షణ లేదన్నట్లు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతారు. కానీ, వెనుకబడిన వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వర్గాలన్నీ మేల్కొంటున్నాయి. ఇన్నాళ్లు అధికారంలో ఉండి తమకేం చేశారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాయి.

కాంగ్రెస్ వాళ్లకోసం వెచ్చించిన నిధులతో పోల్చి చూస్తే, పేదలు, అణగారిన వర్గాలు ఉన్నత స్థానంలో ఉండాలి. కానీ, ఇంకా వాళ్లు సామాజికంగా, ఆర్థికంగా ప్రగతి సాధించలేకపోయారు. వ్యవసాయ రంగం కోసం కాంగ్రెస్ అత్యధిక నిధులు ఖర్చు చేసింది. కానీ, ఆ డబ్బంతా ఆ పార్టీ నేతల జేబుల్లోకే వెళ్లింది’’ అని బొమ్మై వ్యాఖ్యానించారు.