PayCM t-shirt: కర్ణాటక సీఎంకు వ్యతిరేకంగా టీ షర్ట్ ధరించిన కాంగ్రెస్ కార్యకర్త.. అరెస్టు చేసిన పోలీసులు

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి వ్యతిరేకంగా రూపొందించిన ‘పేసీఎం’ టీ షర్ట్ ధరించాడో కాంగ్రెస్ కార్యకర్త. ఈ కారణంతోనే అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

PayCM t-shirt: కర్ణాటక సీఎంకు వ్యతిరేకంగా టీ షర్ట్ ధరించిన కాంగ్రెస్ కార్యకర్త.. అరెస్టు చేసిన పోలీసులు

PayCM t-shirt: ఇటీవల కర్ణాటకలో సీఎం బసవరాజు బొమ్మైకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. పేటీఎమ్ క్యూఆర్ కోడ్‌ను పోలిన పోస్టర్లను బెంగళూరుసహా పలు చోట్ల అతికించారు.

Anti-CAA Protesters: సీఏఏ నిరసనల్లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రూ.57 లక్షలు చెల్లించాలంటూ పోలీసుల నోటీసులు

ఈ పోస్టర్లలోని కోడ్ మధ్యలో బసవరాజు బొమ్మై చిత్రాన్ని ముద్రించారు. ప్రభుత్వ పనులకుగాను, సీఎం 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ పనిచేసింది. అలాగే, దీనికి సంబంధించి కొన్ని టీ షర్ట్స్ కూడా తయారయ్యాయి. ఆ టీ షర్ట్స్‌పై పేసీఎమ్ అనే క్యూఆర్ కోడ్ ఉంది. అయితే, ఇటీవల కర్ణాటకలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా అక్షయ్ కుమార్ అనే ఒక కాంగ్రెస్ కార్యకర్త అలాంటి టీ షర్ట్ ధరించాడు. అతడి టీ షర్ట్‌పై పేసీఎమ్ అనే క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంది. దీంతో సీఎంను అవమానించేలా టీషర్ట్ ధరించినందుకుగాను, అతడిపై కేసు నమోదైంది.

CM KCR New Party: కేసీఆర్ కొత్త పార్టీ పేరు ఇదే.. ప్రకటనకు ముహూర్తం ఖరారు!

దీంతో పోలీసులు అతడిని తాజాగా అరెస్టు చేశారు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు వ్యక్తం చేసింది. ‘పేసీఎం’ అనే టీషర్ట్ ధరించినందుకు తమ కార్యకర్తను అరెస్టు చేసి వేధిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అక్షయ్ కుమార్‌ను అరెస్టు చేసే సందర్భంగా పోలీసులు అతడి మెడపై కొట్టారు. దీంతో వాళ్లు పోలీసులా.. గూండాలా అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది.