Rahul Gandhi : బీజేపీని చూసి భయపడే వాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

బీజేపీ ఐడియాలజీ(సిద్ధాంతం)కి భయపడేవాళ్లు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi : బీజేపీని చూసి భయపడే వాళ్లు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

Rahul (3)

Rahul Gandhi ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ(సిద్ధాంతం)కి భయపడేవాళ్లు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం పార్టీ సోషల్ మీడియా వాలంటీర్లతో వర్చువల్ గా జరిగిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..ఇక్కడ చాలా మంది ధైర్యవంతులు ఉన్నారు.. అందులో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ బయట ఉన్నారు.. అలాంటి వారిని గుర్తించి వెంటనే పార్టీలోకి తీసుకురావాలి. కాంగ్రెస్‌ కు బలం భయంలేని నేతలేనన్నారు. బీజేపీని చూసి భయపడే కాంగ్రెస్ నేతలకు తలుపులు తెరిచే ఉన్నాయని,అలాంటి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయటికి వెళ్లిపోవాలని అన్నారు.

బీజేపీ వ్యూహాలను ఫేక్ న్యూస్ గా రాహుల్ గాంధీ అభివర్ణించారు. కాంగ్రెస్ వర్కర్లు..బీజేపీ ఫేక్ న్యూస్ కి భయపడరన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాపై రాహుల్ విమర్శనాస్రాలు ఎక్కుబెట్టారు. బీజేపీ..తన తన స్థానాన్ని,తన ఇంటిని తీసుకుంటుందన్ భయంతోనే సింధియా బీజేపీలో చేరారని రాహుల్ అన్నారు. యూపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో చాలా బాగా పనిచేసిందంటూ గురువారం ప్రధాని మోదీ వారణాశిలో చెప్పడం చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు. ప్రజలు బీజేపీ ఫేక్ న్యూస్ ని నమ్మడం మానేశారని అన్నారు.