Indian-China Clash: పీఎం కేర్స్‭కు చైనా నుంచి నిధులు? ప్రధాని మోదీకి కాంగ్రెస్ 7 ప్రశ్నలు

చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందంటూ రాజస్తాన్‭లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటయ యుద్ధానికి తెరలేపింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర దాడికి దిగారు. నెహ్రూ హయాంలోని తప్పుల్ని వెతుకుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Indian-China Clash: పీఎం కేర్స్‭కు చైనా నుంచి నిధులు? ప్రధాని మోదీకి కాంగ్రెస్ 7 ప్రశ్నలు

Congress's 7 questions to PM over Tawang clash

Indian-China Clash: ఇండియా-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణ చేసింది. ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం కేర్స్‭కు చైనా నుంచి నిధులు వచ్చాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్‭కు చైనా నుంచి నిధులు వచ్చాయంటూ బీజేపీ చేసిన ఆరోపణల అనంతరం కాంగ్రెస్ ఇలా ఎదురు దాడికి దిగింది. ఇండియా-చైనా వివాదంపై పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

Giriraj Singh: నితీశ్ కుమార్ వారం రోజులు సెలవు తీసుకుని ధ్యానం చేయాలి: కేంద్ర మంత్రి

చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందంటూ రాజస్తాన్‭లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటయ యుద్ధానికి తెరలేపింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర దాడికి దిగారు. నెహ్రూ హయాంలోని తప్పుల్ని వెతుకుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో ప్రతి దాడికి దిగుతోంది. తాజాగా ‘జవాబు ఇవ్వండి మోదీ’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఏడు ప్రశ్నల్ని సంధించింది. ప్రధానమంత్రి దేశ రక్షణకు సంబంధించి ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత రాజకీయంగా, నైతికంగా మోదీకి ఉందని, ఆయన ‘మన్ కీ బాత్‭’లో అయినా ఈ విషయాలు వెల్లడించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

Bihar: తేజశ్వీ యాదవ్‭ని ఇప్పుడే ముఖ్యమంత్రి చేయండి.. నితీశ్ కుమార్‭కు పీకే సలహా

దేశానికి తెలపాల్సిన అవసరం ఉందని, దేశం సైతం అదే కోరుకుంటోందని జైరాం రమేశ్ అన్నారు. అలాగే భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను జైరాం రమేశ్ తప్పు పట్టారు. రోజుకు 20-25 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న వ్యక్తిపై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. 100 రోజులుగా సాగుతున్న ఆ యాత్రలో ప్రజల బాధల్ని రాహుల్ వింటున్నారని, వారికి భరోసా కల్పిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఏడు ప్రశ్నలు

1) జూన్ 20, 2020న తూర్పు లడఖ్‌లోని భారత భూభాగంలోకి చైనా చొరబాటు జరగలేదని మీరు ఎందుకు చెప్పారు?

2) మే 2020కి ముందు క్రమం తప్పకుండా పెట్రోలింగ్ జరిగే తూర్పు లడఖ్‌లో మన దళాలను ఆపి వేలాది చదరపు కిలోమీటర్లు లోపలికి రావడానికి చైనా సైనికులను మీరు ఎందుకు అనుమతించారు?

3) 17 జూలై 2013న మౌంటైన్ స్ట్రైక్ కార్ప్స్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదించిన ప్రణాళికను మీరు ఎందుకు వదులుకున్నారు?

4) పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వడానికి మీరు చైనా కంపెనీలను ఎందుకు అనుమతించారు?

5) గత రెండేళ్లలో రికార్డు స్థాయికి చైనా దిగుమతులు పెరిగాయి. అంత పెద్ద మొత్తంలో చైనా నుండి దిగుమతులను మీరు ఎందుకు అనుమతించారు?

6) సరిహద్దు పరిస్థితులు, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లపై పార్లమెంటులో చర్చ జరగకూడదని ఎందుకు పట్టుబడుతున్నారు?

7) మీరు 18 సార్లు చైనా అగ్ర నాయకత్వాన్ని కలుసుకున్నారు. ఇటీవల బాలిలో జీ జిన్‌పింగ్‌తో కరచాలనం చేసారు. ఆ తర్వాత చైనా తవాంగ్‌లోకి చొరబాటును ప్రారంభించింది. సరిహద్దు విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. మీరు దేశాన్ని ఎందుకు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు?

Elon Musk: విమర్శలతో వెనక్కు తగ్గిన ఎలన్ మస్క్.. జర్నలిస్టుల అకౌంట్లు రీస్టోర్ చేసిన ట్విట్టర్