Anti-Conversion Bill : అసెంబ్లీలోనే మ‌త మార్పిడి నిరోధ‌క బిల్లు కాపీని చింపేసిన డీకే

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శికుమార్...ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే మ‌త మార్పిడి నిరోధ‌క బిల్లు (రైట్ టు ఫ్రీడ‌మ్ ఆఫ్ రిలీజియ‌న్ బిల్‌ 2021)కాపీని చింపేశారు. ఒక మతాన్ని టార్గెట్

Anti-Conversion Bill : అసెంబ్లీలోనే మ‌త మార్పిడి నిరోధ‌క బిల్లు కాపీని చింపేసిన డీకే

Dk

Anti-Conversion Bill : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శికుమార్…ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే మ‌త మార్పిడి నిరోధ‌క బిల్లు (రైట్ టు ఫ్రీడ‌మ్ ఆఫ్ రిలీజియ‌న్ బిల్‌ 2021)కాపీని చింపేశారు. ఒక మతాన్ని టార్గెట్ చేసేందుకు బీజేపీ సర్కార్ ఈ బిల్లు తీసుకొచ్చిందని శివకుమార్ ఆరోపించారు.

మంగళవారం(డిసెంబర్-21,2021) కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర..మ‌త మార్పిడి నిరోధ‌క బిల్లు (రైట్ టు ఫ్రీడ‌మ్ ఆఫ్ రిలీజియ‌న్ బిల్‌ 2021) ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స‌భా సంప్రదాయాల ప్ర‌కారం బిల్లును ప్ర‌వేశ పెట్టేందుకు మంత్రికి అనుమ‌తినిచ్చామ‌ని, దీనిపై బుధ‌వారం చ‌ర్చ ఉంటుందని స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. అయితే బిల్లు సభలో ప్రవేశపెట్టిన వెంటనే డీకే శివకుమార్ ఆ బిల్లు ప్రతులను చించివేశారు. బిల్లుపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

మత మార్పిడి నిరోధక బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు మతసామరస్యానికి భంగం కలిగించి, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని, ఫలితంగా కర్ణాటకలో పెట్టుబడులు తగ్గేందుకు కూడా దారితీస్తుందని అన్నారు.

తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి బసవరజ్ బొమ్మై స్పందించారు. ఈ బిల్లుపై చ‌ర్చించేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం దొరికింద‌ని, అయినా వారు దానిని ఉప‌యోగించుకోవ‌డం లేద‌ని, ఇందులో ప్రభుత్వం త‌ప్పు ఏమాత్ర‌మూ లేద‌ని సీఎం బొమ్మై అన్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు ప్రకారం.. సామూహిక మతమార్పిడులకు పాల్పడే వారికి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తి మైనారిటీ రిలిజియన్ గ్రూపులోకి మారితే అతను రిజర్వేషన్లతో సహా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను కోల్పోతాడు. కాగా, ఈ బిల్లును రాష్ట్రంలోని క్రిష్టియన్ సంస్థల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది.

ALSO READ Massive Fire At Indian Oil : ఐఓసీలో భారీ అగ్నిప్రమాదం..ముగ్గురు మృతి,40మందికి గాయాలు