Ex-gratia for Covid Deaths: కరోనాతో చనిపోతే నాలుగు లక్షలు..? సుప్రీంకోర్టులో విచారణ!

కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్టు నుంచి పది రోజుల సమయం కోరింది.

Ex-gratia for Covid Deaths: కరోనాతో చనిపోతే నాలుగు లక్షలు..? సుప్రీంకోర్టులో విచారణ!

Ex Gratia For Covid Deaths

Considering Ex-gratia: కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్టు నుంచి పది రోజుల సమయం కోరింది. ఈ విషయాన్ని జూన్ 21వ తేదీన కోర్టు విచారించనుంది. జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ముందు శుక్రవారం జరిగిన విచారణలో, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ప్రభుత్వం ఈ పిటిషన్‌ను ప్రతివాదిగా తీసుకోవడం లేదని, ఈ విషయాన్ని సానుభూతితో పరిశీలిస్తుందని వెల్లడించారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు.

కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిని అమలు చేశాయని న్యాయమూర్తి ప్రభుత్వం తరపున లాయర్‌కు వివరించారు. బీహార్ రూ .4 లక్షల పరిహారాన్ని ప్రకటించిందని చెప్పుకొచ్చారు. కానీ చాలా రాష్ట్రాలు తమ విధానాన్ని ఇంకా ప్రకటించలేదు. దీనిపై కేంద్ర స్థాయిలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని మెహతా తెలిపారు. తన జవాబును దాఖలు చేయడానికి కేంద్రం నుండి రెండు వారాల సమయం కోరగా.. మీకు ఎందుకు ఎక్కువ సమయం కావాలి? అని ప్రశ్నించింది కోర్టు.

కరోనాకు సంబంధించి మిగిలిన అనేక విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని, సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నిస్తుందని, అందుకే సమయం పడుతుందని మెహతా చెప్పారు. అయితే రెండు వారాల్లో కాకుండా 10 రోజుల్లో సమాధానం దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని జూన్ 21న మరోసారి విచారించనున్నట్లు చెప్పింది. పిటిషనర్లకు దాఖలు చేయాల్సిన అఫిడవిట్ కాపీని రెండు రోజుల ముందు శనివారం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.

ఈ సమయంలో, పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. మరణ ధృవీకరణ పత్రంలో మరణానికి కారణం కూడా పేర్కొనట్లేదు అని చెప్పారు. దీనికి సంబంధించి మెహతా మాట్లాడుతూ.. ఈ విషయం పరిశీలనలో ఉందని చెప్పారు. కరోనా ఫలితంగా బ్లాక్ ఫంగస్‌ కూడా వస్తుందనే విషయాన్ని పిటీషనర్ తరపు న్యాయవాది లేవనెత్తగా.. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పుడు, ప్రభుత్వం సమాధానం రావనివ్వండి అప్పటివరకు వేచిచూద్దాం అని కోర్టు సూచించింది.

కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతూ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో వేయగా.. రెండూ కూడా పెండింగ్‌లో ఉన్నాయి, ఒకటి న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సాల్, మరొకటి న్యాయవాది రిపక్ కన్సల్ వాదిస్తున్నారు. దీంతో పాటు, కరోనాతో మరణించిన వారికి డెత్ సర్టిఫికేట్ జారీ చేయడానికి సంబంధించి ఒక విధానం లేదని, డెత్ సర్టిఫికేట్‌కు సంబంధించి ఏకరూప విధానం తీసుకుని రావాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరుతున్నారు. ఏకరూప విధానం లేకపోతే, బాధిత కుటుంబం ఏ ప్రయోజనాన్ని పొందలేరని కోర్టుకు చెప్పారు న్యాయవాదులు.