కరోనా వార్డులో నోరు మూసి మహిళా కానిస్టేబుల్ పై తోటి ఉద్యోగి అత్యాచారం

  • Published By: madhu ,Published On : August 26, 2020 / 01:41 PM IST
కరోనా వార్డులో నోరు మూసి మహిళా కానిస్టేబుల్ పై తోటి ఉద్యోగి అత్యాచారం

కరోనా వార్డులో మహిళా కానిస్టేబుల్ పై తోటి ఉద్యోగి అత్యాచారం జరిపాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆమె కేకలు వేయకుండా..నోరు మూసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చట్టాలను రక్షించాల్సిన వ్యక్తి..బాధితులకు అండగా ఉండాల్సిన కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు.



జంషెడ్ పూర్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి..విధి నిర్వాహణలో ఉండగా చనిపోయాడు. దీంతో కారుణ్య నియామకం కింద..ఆయన ఉద్యోగం భార్యకు ఇచ్చారు. ఆమెకు సిద్ గోరాలో విధుల బాధ్యతను అప్పచెప్పారు. ఉన్నతాధికారులు ఓ కోవిడ్ సెంటర్ లో విధుల బాధ్యత అప్పచెప్పారు. ఆమెతో పాటు మరో కానిస్టేబుల్ అనీల్ కుమార్ అక్కడే డ్యూటీ చేస్తున్నాడు.
https://10tv.in/ips-officer-asks-upsc-candidate-to-replace-smartphone-with-nokia-5310-to-crack-civil-services/
కానీ..ఆమెపై కొంతకాలంగా ఈ కానిస్టేబుల్ కన్ను పడింది. సమయం చూసి..బిల్డింగ్ పై అంతస్తులో పై గదికి తీసుకెళ్లాడు. నోరు మూసి..ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహంచామని, ఎక్స్ రే ఇతర పరీక్షల నివేదికలు బుధవారం వస్తాయని Sidhgora Officer-in-Charge Manoj Thakur వెల్లడించారు.



కింది అంతస్తులో వైరస్ బలంగా ఉందని, పై అంతస్తు సురక్షితంగా ఉందని వెల్లడిస్తూ..గదులను చూపించే నెపంతో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు వెల్డడించిందని తెలిపారు. నోరు కట్టివేయడంతో తాను సహయం కోసం అరవలేకపోయారన్నారు.