రికార్డు టైమ్ లో నేషనల్ హైవే : 18 గంటల్లో 25 కి.మీ రోడ్డు నిర్మాణం

రికార్డు టైమ్ లో నేషనల్ హైవే : 18 గంటల్లో 25 కి.మీ రోడ్డు నిర్మాణం

National Highway road : మామూలుగా ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మించాలంటే.. బాబోయ్.. అదో పెద్ద కథ… ఇక జాతీయ రహదారి అయితేనా… ఇక అదో ప్రస్థానమే… సర్వే చేసిన తర్వాత నుంచి రోడ్డు పూర్తయ్యే వరకు పెద్ద ప్రక్రియ… పని ప్రారంభం అయిన తర్వాత.. పైన పూత పూసేందుకే.. కిలోమీటర్‌కు కనీసం 3 రోజులు సమయం పడుతుంది. అలాంటింది నేషనల్ హైవే అధికారులు రికార్డు సృష్టించారు.

మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్‌ మధ్య కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులను అధికారులు రికార్డు సమయంలో పూర్తి చేశారు. షోలాపూర్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిలో 25 కిలోమీటర్ల పనులను కేవలం 18 గంటల్లోనే అధికారుల పూర్తి చేశారు. ఇందుకోసం ముందస్తుగా భారీ ప్రణాళిక వేసుకున్నారు. సుమారు 500 మంది కార్మికులు, 40 మంది ఇంజినీర్లు పని చేశారు.

ఏకకాలంలో సుమారు 30 యంత్రాలతో పాటు 60 టిప్పర్లతో రహదారిపై కాంక్రీట్, తారు మిక్సింగ్ పూత పూశారు. క్వాలిటీ చెకింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా కేవలం 18 గంటల్లోనే 25 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులను అధికారులు పూర్తి చేసి ప్రయాణాలకు అనుమతి ఇచ్చారు.