గుడిలో కొట్టకుండానే మోగే గంట..!!కరోనా కాలంలో కాంటాక్ట్ లెస్ గంట చూడండీ..

  • Published By: nagamani ,Published On : June 15, 2020 / 07:28 AM IST
గుడిలో కొట్టకుండానే మోగే గంట..!!కరోనా కాలంలో కాంటాక్ట్ లెస్ గంట చూడండీ..

ఏగుడికి వెళ్లినా గంట కొడతాం. ఎవరన్నా కొడితేనే గంట మోగుతుంది. కానీ ఓ గుడిలో ఉన్న గంట మాత్రం ఎవ్వరూ కొట్టకుండానే మోగుతోంది. అంటే ఎవరూ మోగించకుండానే మోగుతోంది. ఈ కరోనా వైరస్ కాలంలో ఇటువంటి గంట ఉండటం చాలా మంచిదేనంటున్నారు భక్తులు. ఇంతకీ ఆ గంట ఎక్కడ ఉందో..ఆ గంట ప్రత్యేక ఏంటో చూద్దాం.. 

లాక్ డౌన్ సడలింపుల తరువాత తెరుచుకుంటున్న దేవాలయాల్లో గంటను ఒకరి తరువాత మరొకరు భక్తులు తాకుతూ ఉంటే కరోనా వైరస్ ఇట్టే వ్యాపించే అవకాశం ఉంది. కానీ  మధ్యప్రదేశ్ లోని మందాసుల్ ప్రాంతంలో ఉన్న పశుపతినాథ్ దేవాలయంలోని గంటను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.  ఎవరూ తాకకుండానే గంట కొట్టుకునే ఏర్పాటు చేశారు. ఈ గంట సెన్సార్ సాయంతో పనిచేస్తుందని అధికారులు తెలిపారు.ఈ కరోనా కాలంలో అధికారులు  కాంటాక్ట్ లెస్ గంటను ఏర్పాటు చేయటంతో భక్తులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

 ఆ గంట కింద నిలబడి..దాన్ని కొడుతున్నట్టు అనుభూతి చెందుతున్నారు భక్తులు. అన్ని దేవాలయాల్లోనూ ఇటువంటి గంటలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎవరైనా దాని కిందకు వచ్చి పైకి చెయ్యి చాస్తేనే అది మోగుతుంది.

ఈ కాంటాక్ట్ లెస్ గంటను 62 సంవత్సరాల నారూ ఖాన్ మేవ్ అనే ముస్లిం వయోవృద్ధుడు తయారు చేయడం ఇక్కడ గమనించాల్సిన మరో విశేషం.  దీని కోసం తాను ఓ సెన్సార్ ను ఇండోర్ నుంచి తెచ్చామని..రూ. 6 వేలు ఖర్చు పెట్టి, ఆలయంలో గంట దానంతట అదే మోగేలా చేశానని  నారూ ఖాన్ మేవ్ తెలిపారు. ఈ కాంటాక్ట్ లెస్ గంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.