ICMR: ‘కోవిడ్ పేషెంట్లను కాంటాక్ట్ అయిన వ్యక్తులను పరీక్ష చేయాల్సిన అవసరంలేదు’

ఐసీఎమ్ఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ పేషెంట్లకు దగ్గరగా ఉన్న వారిని హై రిస్క్ ఉంటేనే తప్ప ఎటువంటి లక్షణాలు లేనప్పుడు పరీక్ష చేయాల్సిన అవసరం లేదని సోమవారం వెల్లడించింది.

ICMR: ‘కోవిడ్ పేషెంట్లను కాంటాక్ట్ అయిన వ్యక్తులను పరీక్ష చేయాల్సిన అవసరంలేదు’

Icmr

ICMR: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ పేషెంట్లకు దగ్గరగా ఉన్న వారిని హై రిస్క్ ఉంటేనే తప్ప ఎటువంటి లక్షణాలు లేనప్పుడు పరీక్ష చేయాల్సిన అవసరం లేదని సోమవారం వెల్లడించింది. కరోనావైరస్ శాంపుల్స్ పై రీసెంట్ గా పరీక్షలు జరిపి గైడ్ లైన్స్ విడుదల చేసింది.

60ఏళ్లు లేదంటే డయాబెటిస్, హైపర్ టెన్షన్, క్రోనిక్ లంగ్, కిడ్నీ వ్యాధులు, ఒబెసిటీ ఉన్న వారు కొవిడ్ పేషెంట్ తో కాంటాక్ట్ అయి ఉంటే వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. మరోవైపు లక్షణాలు లేకుండానే ఉన్న గర్భిణీ మహిళలకు పరీక్షలు జరిపి భయాందోళనకు గురి చేయొద్దని సూచించింది. మొత్తానికి పరీక్షలు నిలిపేయకుండా ఎమర్జెన్సీగా జరపడాన్ని వాయిదా వేయాలని తెలిపింది.

ఈ కొవిడ్ పరీక్షలు పేరుతో అత్యవసరమైన మిగతా పరీక్షలకు ఆలస్యమవుతుందని తెలిపింది. రాష్ట్ర పరిధిలో ప్రయాణించే వ్యక్తులకు పరీక్షలు జరపాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి: వైరస్ ఎఫెక్ట్.. డీజే టిల్లు విడుదల వాయిదా!

RT-PCR, TrueNat, CBNAAT, CRISPR, RT-LAMP, ర్యాపిడ్ మాలిక్యూలర్ టెస్టింగ్ సిస్టమ్స్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT) ద్వారా పరీక్షను చేపట్టవచ్చని పేర్కొంది.

ఇంట్లో లేదా ఇతర మాలిక్యూలర్ పరీక్షలను నిర్ధారణగా పరిగణించవచ్చని సలహాదారు తెలిపారు. రోగలక్షణ వ్యక్తులు, ఇంటి/స్వీయ-పరీక్ష లేదా RATలో ప్రతికూల పరీక్షలు చేయించుకున్న వ్యక్తులు RT-PCR పరీక్షను చేపట్టాలని పేర్కొంది.