Chennai : నడిరోడ్డుపై నిలిచిపోయిన రూ.1,070 కోట్ల కరెన్సీ ట్రక్కులు .. భారీగా తరలివచ్చిన స్థానికులు

నడిరోడ్డుపై కోట్ల రూపాయల కరెన్సీ కట్టలున్న కంటైనర్లు ఆగిపోయి ఉన్నాయి. అది తెలిసిన జనాలు భారీగా వచ్చారు.

Chennai : నడిరోడ్డుపై నిలిచిపోయిన రూ.1,070 కోట్ల కరెన్సీ ట్రక్కులు .. భారీగా తరలివచ్చిన స్థానికులు

Currency Container breaks down

Currency Container breaks down : నడిరోడ్డుపై కొన్ని కంటైనర్లు ఆగిపోయి ఉన్నాయి. వాటిలో వందలాది కోట్ల రూపాయలున్నాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు గుంపులు గుంపులుగా రోడ్డుమీదకు చేరుకున్నారు. ఏమాత్రంవీలున్నా మొత్తం దోచుకుపోయేవారేమో.. ఎందుకంటే ఆయా వస్తువులతోను..సరుకులతోను ప్రయాణించే లారీలో బోల్తా పడిన సందర్భాల్లో స్థానికులు వాటిని పట్టుకుపోవటం చూస్తుంటాం. కానీ అవి ఆర్బీఐ కరెన్సీ కావటంతో పోలీసులు భారీగా సెక్యుటీ ఉండటంతో చూసి చూసి వెనుతిరిగి వెళ్లిపోయారట. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ అనూహ్య ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడులోని ఆర్ బీఐ చెన్నై శాఖ రెండు ట్రక్కుల్లో రూ.1,070 కోట్లను విల్లుపురానికి పంపించింది. రెండు ట్రక్కులు ఈ కరెన్సీ కట్టలతో విల్లుపురానికి బయల్దేరాయి. ఈక్రమంలో ట్రక్కులు చెన్నై – తిరుచ్చి జాతీయ రహదారిపై తాంబరం శానిటోరియం సమీపంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధ సమీపంలోకి రాగానే సడెన్ గా రోడ్డుమీద ఆగిపోయాయి. విల్లుపురం నుంచి జిల్లాలోని బ్యాంకులకు కరెన్సీ పంపిణీ జరగాల్సిఉండగా ఈ ఘటన జరిగింది.

ఓ ట్రక్కులో సాంకేతిక సమస్య ఏర్పడడంతో తాంబరం వద్ద రెండు ట్రక్కులు ఆగిపోయాయి. జాతీయ రహదారిపై వెళుతున్న వీటికి 17 మంది పోలీసులు కాపలాగా ఉన్నారు. రూ.535 కోట్ల కరెన్సీని తరలిస్తున్న ఓ ట్రక్ నిలిచిపోయినట్టు క్రోమ్ పేట్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే క్రోంపేట పోలీసులకు సమాచారం అందించి భద్రతను కల్పించారు. తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధ ప్రాంగణానికి ట్రక్కులను తరలించారు.తాంబరం అసిస్టెంట్ పోలీసు కమిషనర్ శ్రీనివాసన్ తన టీమ్ తో భద్రతను పర్యవేక్షించారు. సమస్యలేని ట్రక్ ను భద్రతతో అక్కడి నుంచి పంపించారు. ఓ ట్రక్ లో సమస్యను మెకానిక్ లు సరిచేయలేకపోవడంతో దాన్ని తిరిగి చెన్నైలోని ఆర్ బీఐకి పంపించేశారు.