గోవులను తరలించే వారు టెర్రరిస్టులా!

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 05:19 AM IST
గోవులను తరలించే వారు టెర్రరిస్టులా!

అల్వర్ : గోవులను తరలించే వారు టెర్రరిస్టులా ? అంటే అవునంటున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే. అల్వర్‌లో రెండు రోజుల కిందట 23 ఏళ్ల వయస్సున్న పశువులను అక్రమంగా తరలిస్తున్నారంటూ దాడి జరిగింది. గోవులను తరలించడం…వధించడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గ్యాన్‌దేవ్ మాట్లాడారు. గోవులను తరలించే వారు..వధించే వారిని తాను టెర్రరిస్టులు..అంటూ వ్యాఖ్యానిస్తానని తెలిపారు. ఇది ఒక విధంగా టెర్రరిజం కన్నా అత్యంత క్రైమ్ అని అభివర్ణించారు. అక్రమంగా తరలిస్తున్నా స్థానిక పోలీసులు ఎలాంటి నోటీసులు జారీ చేయడం లేదని వ్యాఖ్యానించారు. 

45 మంది మృతి…
9 రాష్ట్రాల్లో 2014, 3 మార్చి 2018 వరకు 45 మంది చనిపోగా…40 కేసులు బుక్ చేయడం జరిగిందని మినిస్టర్ హోం అఫైర్స్ వెల్లడించింది. గోవులను అక్రమంగా తరలిస్తుండగా జరుగుతున్న నేరాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఇటీవలే సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే ఇటీవలే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..గోవుల తరలింపు..జరుగుతున్న ఘర్షణలపై స్పందించారు. దాడులపై ఆయా రాష్ట్రలు కఠిన చర్యలు తీసుకోవాలని…దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని…లోక్ సభలో మోడీ వ్యాఖ్యానించారు.