హెచ్ఐవీ సోకిన గర్భిణీకి ఆర్థిక సాయం..

హెచ్ఐవీ సోకిన 8నెలల గర్భిణీకి తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. బాధిత మహిళకు మూడు సెంట్ల స్థలంతో పాటు రూ. 2 లక్షల నగదును కూడా ఆర్థికసాయంగా అందించారు.

  • Edited By: sreehari , December 30, 2018 / 10:29 AM IST
హెచ్ఐవీ సోకిన గర్భిణీకి ఆర్థిక సాయం..

హెచ్ఐవీ సోకిన 8నెలల గర్భిణీకి తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. బాధిత మహిళకు మూడు సెంట్ల స్థలంతో పాటు రూ. 2 లక్షల నగదును కూడా ఆర్థికసాయంగా అందించారు.

  • తమిళనాడు ప్రభుత్వం ప్రకటన..  

  • మూడు సెంట్ల స్థలం.. రూ. 2 లక్షల చెక్

  • ఆస్పత్రిలో గర్భిణీకి అందించిన జిల్లా కలెక్టర్.. 

మధురై: హెచ్ఐవీ సోకిన 8 నెలల గర్భిణికి తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేందుకు అందించింది. బాధిత మహిళకు మూడు సెంట్ల స్థలంతో పాటు రూ. 2 లక్షల నగదును కూడా ఆర్థికసాయంగా అందించింది. ఈ మేరకు విర్దూ నగర్ కలెక్టర్ శివగ్నమ్ బాధిత మహిళ దగ్గరకు వెళ్లి హౌసింగ్ పట్టాను అందజేశారు. రక్తహీనత కారణంగా ఈ నెల 3న ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన మహిళకు ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం తెప్పించి ఎక్కించిన సంగతి తెలిసిందే. ఎక్కించిన రక్తంలో హెచ్ఐవీ వైరస్ ఉన్న విషయం బయటకు పొక్కడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆస్పత్రికి జిల్లా కలెక్టర్.. పట్టా భూమి చెక్ అందజేత..
హెచ్ఐవీ సోకిన బాధిత మహిళను మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించడానికి ఆమె భర్త తొలుత అంగీకరించలేదు. చివరికి మహిళను మధురైలోని ప్రభుత్వ రాజ్‌జ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆస్పత్రిని సందర్శించి బాధిత మహిళను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఐవీ బాధిత మహిళకు మూడు సెంట్ల పట్టా భూమితో పాటు రూ. 2 లక్షల చెక్‌ను కూడా అందజేశారు. 

రక్తదానం చేసిన యువకుడు విషం తాగి మృతి.. 
మరోవైపు హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు ఇచ్చిన యువకుడు విషం తాగి మృతిచెందాడు. ఇతడి రక్తాన్నే వైద్య సిబ్బంది 8 నెలల గర్భిణీకి ఎక్కించారు. ఇటీవల విదేశాల్లో ఉద్యోగం కోసం పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో తనకు హెచ్ఐవీ ఉందనే విషయం అతడికి తెలిసింది. ఇంతలో అతడు ఇచ్చిన రక్తాన్ని మరో మహిళకు ఇచ్చారని తెలిసి షాకయ్యాడు.