సొంత ఇంటి కల సాకారం : సబ్సిడీ స్కీమ్ పొడిగింపు

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 08:02 AM IST
సొంత ఇంటి కల సాకారం : సబ్సిడీ స్కీమ్ పొడిగింపు

ఢిల్లీ : సొంత ఇల్లు ప్రతీ ఒక్కరికి కల.  ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా పేద, మధ్యతరగతివారికి అది తీరని కలగానే మిగిలిపోతోంది. ఇప్పుడలా కాదు.. స్వంత ఇంటి కలను నెరవేర్చేందుకు మేమున్నామంటోంది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం. మీ ఇంటి కలను సాకారం చేస్తామంటోంది. రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకూ సంవత్సర ఆదాయం ఉన్నవారు ఇంటికోసం తీసుకునే లోన్ పై రూ. 2.5 లక్షల సబ్సిడీని అందించే  పథకం సమయాన్ని పొడిగిస్తు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ సమయాన్ని  మార్చి 2020 వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఈ పథకం కింద  ఇప్పటివరకూ 93 వేల మంది లబ్దిని పొందారని..హౌస్ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,960 కోట్లను అందించిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లును ఏర్పరచాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2015 జ‌న‌వ‌రిలో ఈ కార్య‌క్ర‌మాన్ని విషయం తెలిసిందే.