ఫ్రీ శానిటరీ నాప్ కిన్స్ : సర్కార్ కాలేజ్ అమ్మాయిలకు

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 09:39 AM IST
ఫ్రీ శానిటరీ నాప్ కిన్స్ : సర్కార్ కాలేజ్ అమ్మాయిలకు

జయపూర్ : గవర్నమెంట్ కాలేజ్ అమ్మాయిలకు శానిటరీ నాప్ కిన్స్ ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ పేద బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రీగా శానిటరీ నాప్ కిన్స్ ను ఇవ్వాలని నిర్ణయించింది.  ప్రభుత్వం కాలేజ్ లలో సాధారణంగా మధ్యతరగతి, పేద వర్గాలకు చెందినవారే చదువుతుంటారు. వీరికుండే ఆర్థిక పరిస్థితుల రీత్యా శానిటరీ నాప్కిన్స్ కొనుక్కునే వీలు లేకపోవటంతో వారు బట్ట నాపీలనే వినియోగిస్తుంటారు. దీంతో వారు పలు అనారోగ్యాలకు గురవటం జరుగుతున్న క్రమంలో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వారు ఆరోగ్యకరమైన స్వేచ్ఛా ఆరోగ్య నాప్కిన్స్ ను వినియోగించుకోనున్నారు. 

జూలై 2019 నుంచి వచ్చే అకాడెమిక్ సెషన్ నుంచి రాష్ట్రంలోని 189 ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత వైద్యపరమైన రుమ విక్రయ యంత్రాలను ఏర్పాటు చేయాలని హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నిర్ణయించింది. దీని కోసం కొన్ని స్కూల్స్, కాలేజెస్, రైల్వే స్టేషన్లలో సానిటరీ రుప్ విడింగ్ మెషిన్లను ఇన్ స్టాల్ చేసేందుకు మాజీ సీఎం వసుంధరా రాజే ప్రభుత్వం నిర్ణయించింది. కాగా 2018 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తగిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనుంది. దీని కోసం 2.5 కోట్లు ఖర్చవుతాయని హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ చెందిన భన్వర్ సింగ్ భాటి అన్నారు. 

రాజస్థాన్లో ప్రభుత్వ కళాశాలల్లో 2.8 లక్షల బాలికలు ఉండగా..వారిలో ఎక్కువ శాతం అత్యంతతక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల నుండి వచ్చిన విద్యార్ధినులే ఎక్కువమంది వున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్  తీసుకున్న ఈ నిర్ణయంతో జయపూర్ లోని ప్రభుత్వం కాలేజ్ అమ్మాయిలు రుతు క్రమం సమయంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి బైటపడనున్నారు.