శబరిమల ఆలయం మూసివేత : మహిళల ప్రవేశంతో శుద్ధి

శబరిమల ఆలయం మైల పడిందా ? మహిళలు అయ్యప్పను దర్శించుకోవడంతో అయ్యప్ప పవిత్రతను ప్రశ్నిస్తుందా.. ఆలయ పూజారుల వైఖరి ఇలాంటి సందేహాలను రేకెత్తిస్తోంది.

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 06:06 AM IST
శబరిమల ఆలయం మూసివేత : మహిళల ప్రవేశంతో శుద్ధి

శబరిమల ఆలయం మైల పడిందా ? మహిళలు అయ్యప్పను దర్శించుకోవడంతో అయ్యప్ప పవిత్రతను ప్రశ్నిస్తుందా.. ఆలయ పూజారుల వైఖరి ఇలాంటి సందేహాలను రేకెత్తిస్తోంది.

కేరళ : శబరిమల ఆలయం మైల పడిందా ? మహిళలు అయ్యప్పను దర్శించుకోవడంతో అయ్యప్ప పవిత్రతను ప్రశ్నిస్తుందా.. ఆలయ పూజారుల వైఖరి ఇలాంటి సందేహాలను రేకెత్తిస్తోంది. 2019, జనవరి 2వ తేదీ తెల్లవారుజామున 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేశారు పూజారులు. శుద్ధి కార్యక్రమం చేపట్టారు. శబరిమలలోని పూజారులు అందరూ కూడా ఈ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇద్దరు మహిళలు గుడిలోకి వెళ్లడం వల్లే ఈ శుద్ధి చేపట్టినట్లు తెలిపారు. అపచారంగా భావించటం వల్లే ఇలా చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. శుద్ధి కార్యక్రమం తర్వాత అయ్యప్ప ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. 

అయ్యప్పను దర్శించుకున్న మహిళలు…
బిందు, కనకదుర్గ ఇద్దరు మహిళలు శబరిమల ఆలయం లోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లదుస్తులు ధరించి పంబకు చేరుకున్నారు. తెల్లవారుజామున 3.45గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు. వీరు ప్రవేశించిన దృశ్యాలు సంచలనం అయ్యాయి.పోలీసులు బందోబస్తులో వచ్చారు. గతంలో కూడా వీరు అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చి విఫలం చెందారు. జనవరి 2వ తేదీ మాత్రం అయ్యప్పను దర్శించుకుని సక్సెస్ అయ్యారు. ఆలయ ప్రవేశంపై వివక్ష చూపొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది. 

#WATCH Two women devotees Bindu and Kanakdurga entered & offered prayers at Kerala’s #SabarimalaTemple at 3.45am today pic.twitter.com/hXDWcUTVXA

— ANI (@ANI) January 2, 2019

Read also: శబరిమల ఆలయంలో మహిళల పూజలు