Sanjay Raut : కాంట్రాక్ట్ కిల్లింగ్స్ స్థానంలో గవర్న్‌మెంట్ కిల్లింగ్స్..కేంద్రంపై సేన విమర్శలు

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం,బీజేపీపై శివసేన ఫైర్ అయింది. మహారాష్ట్రలోని రాజకీయ ప్రత్యర్థులను ఫినిష్ చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లింగ్స్ స్థానంలో

Sanjay Raut : కాంట్రాక్ట్ కిల్లింగ్స్ స్థానంలో గవర్న్‌మెంట్ కిల్లింగ్స్..కేంద్రంపై సేన విమర్శలు

Sena

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం,బీజేపీపై శివసేన ఫైర్ అయింది. మహారాష్ట్రలోని రాజకీయ ప్రత్యర్థులను ఫినిష్ చేసేందుకు కాంట్రాక్ట్ కిల్లింగ్స్ స్థానంలో గవర్న్‌మెంట్ కిల్లింగ్స్ వచ్చి చేరాయని శివసేన పత్రిక “సామ్నా” సంపాదకీయంలో ఎంపీ సంయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు.

గతంలో అండర్ వరల్డ్ చురుకుగా పనిచేసినప్పుడు కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఉండేవని, ప్రత్యర్థులను అంతం చేసేందుకు ఈ గ్యాంగులను ఉపయోగించే వారని, ఇప్పడు వారి స్థానంలో గవర్న్‌మెంట్ కిల్లింగ్స్ వచ్చి చేరాయని ‘రోహ్‌తక్’ అనే వీక్లీ కాలమ్‌లో సంజయ్ రౌత్ ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారి కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు కాంట్రాక్టు కిల్లర్లుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇదొక కొత్త పాలసీగా పెట్టుకున్నట్టు కనిపిస్తోందని కేంద్రంపై ఫైర్ అయ్యారు.

మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం… ఈడీ, ఆదాయ పన్ను స్కానర్‌లో ఉందని,తమ నేతలు సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారన్నారు. చట్ట నిబంధనలు కానీ రూల్ ఆఫ్ రెయిడ్స్ కానీ మహారాష్ట్రలో ఉన్నాయా అని రౌత్ ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రికార్డు స్థాయిలో దాడులకు పాల్పడటం చూస్తే ఎవరికైనా ఇలాంటి అనుమానాలే కలుగుతాయన్నారు.

గతంలో ఢిల్లీ పాలకులు అబద్ధాలు చెబుతుండే వారని, ఇప్పుడు ఎలాంటి క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్(పెట్టుబడి) లేకుండానే తరచు దాడులు నిర్వహించడమే వ్యాపారంగా పెట్టుకున్నారని అన్నారు. ఎన్సీపీ నేత,మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ను డ్రగ్స్ రాకెట్‌లో ప్రమేయం ఉందంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి 8 నెలలు జైలులో పెట్టారని, అయితే ఖాన్ దగ్గర దొరికినవి డ్రగ్స్ కాదని, హెర్బల్ టుబాకో అని కోర్టు పేర్కొన్న నేపథ్యంలో ఎన్సీబీ అధికారులపై నవాబ్ మాలిక్ కేసు పెట్టాలన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబ సభ్యులపై ఆదాయం పన్ను శాఖ దాడులు జరిపిందని సంజయ్ రౌత్ విమర్శించారు.

ALSO READ  Heavy Rainfall In Kerala : 21కి చేరిన మృతుల సంఖ్య..కేరళ సీఎంకి మోదీ ఫోన్