Kerala: మటన్ కొంచమే పెట్టారని జైలర్లను కొట్టిన ఖైదీ.. ఆ తర్వాత..
అతడికి పెట్టిన మటన్ ను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు.

Mutton Biryani For Prisoners
Kerala prison: జైలులో తనకు మటన్ కొంచమే పెట్టారని జైలర్లపై ఓ ఖైదీ దాడి చేశాడు. కేరళలోని పూజపురా సెంట్రల్ జైల్ (Poojappura Central Jail) లో ఈ ఘటన చోటుచేసుకుంది. వయానాడ్ కు చెందిన ఫైజాస్ డ్రగ్స్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఆహార షెడ్యూలులో భాగంగా ఖైదీలకు మాంసాహారం కూడా పెడుతుంటారు. శనివారం మెనులో భాగంగా ఖైదీలందరికీ మటన్ వండి పెట్టారు. అయితే, తనకు తక్కువగా పెట్టారని ఫైజాస్ జైలర్లపై దాడికి దిగాడు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న అతడిపై ఇప్పుడు మరో కేసు పెట్టామని పోలీసులు చెప్పారు.
“శనివారం సాధారణంగా ఖైదీలకు మటన్ కర్రీ పెడుతుంటాం. అందరికీ పెట్టినట్లే ఫైజాస్ కు కూడా పెట్టాం. అతడు మరింత పెట్టాలని అన్నాడు. రచ్చ రచ్చ చేశాడు. అతడికి పెట్టిన మటన్ ను తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. డిప్యూటీ సూపరింటెండెంట్ తో పాటు పలువురు సీనియన్ జైలు అధికారులపై దాడికి దిగాడు” అని జైలు అధికారి చెప్పారు. ఫైజాస్ ఇతర ఖైదీలతోనూ గొడవ పడుతుంటాడని, అతడిని స్పెషల్ వార్డుకి తరలించామని వివరించారు.
Kurnool : కొడుకుల భయంతో..! భర్త మృతదేహానికి ఇంట్లోనే చితి పేర్చిన భార్య.. గుండెలు పిండే విషాదం