దాహార్తి తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డయాబెటిస్, గుండె జబ్బులు రావొచ్చు

ఎండా కాలం వచ్చేసింది. అప్పుడే సూర్యుడు మండిపోతున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. సుర్రుమనే ఎండతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు దాహంతో గొంతులు ఎండిపోతున్నాయి. ఎంత నీరు తాగినా దాహం తీరడం లేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. కూలర్లు, ఏసీలు ఆన్ చేసేశారు. దాహార్తిని తీర్చుకోవడానికి కొందరేమో కూల్ వాటర్ తాగుతుంటే, మరికొందరు చల్లని పానియాలవైపు చూస్తున్నారు. చాలామంది దాహార్తిని తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు.

దాహార్తి తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డయాబెటిస్, గుండె జబ్బులు రావొచ్చు

cool drinks very danger for health: ఎండా కాలం వచ్చేసింది. అప్పుడే సూర్యుడు మండిపోతున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. సుర్రుమనే ఎండతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు దాహంతో గొంతులు ఎండిపోతున్నాయి. ఎంత నీరు తాగినా దాహం తీరడం లేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. కూలర్లు, ఏసీలు ఆన్ చేసేశారు. దాహార్తిని తీర్చుకోవడానికి కొందరేమో కూల్ వాటర్ తాగుతుంటే, మరికొందరు చల్లని పానియాలవైపు చూస్తున్నారు. చాలామంది దాహార్తిని తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు.

మిగతా వాటి సంగతేమో కానీ, కూల్ డ్రింక్స్ తో ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగితే దాహార్తి తీరడం మాటేమో కానీ, కొత్తగా అనేక అనారోగ్య సమస్యలు రావడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే, కూల్ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువ శాతంలో ఉంటుంది. అది శరీరంలో కొవ్వును పెంచుతుంది. దీంతో బరువు పెరుగుతారు. ఫలితంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. అందుకూ కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే బెటర్ అంటున్నారు. కావాలంటే కొబ్బరిబోండాలు, పుచ్చకాయ, నిమ్మ, చెరుకు రసం వంటి పానియాలు తాగడం ఉత్తమం అని డాక్టర్లు అంటున్నారు.