Chopper Crash: డీఎన్‌ఏ టెస్ట్‌ల తర్వాతే అమరుల మృతదేహాలను గుర్తిస్తారు

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు.

Chopper Crash: డీఎన్‌ఏ టెస్ట్‌ల తర్వాతే అమరుల మృతదేహాలను గుర్తిస్తారు

Dna Test (1)

Chopper Crash: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు కేవలం నలుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు అధికారులు. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా రావత్‌, బ్రిగేడియర్‌ LS లిడ్డర్‌, లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌ పార్థివదేహాలను నిర్ధారించారు.

అంత్యక్రియల నిమిత్తం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మిగిలిన వారిని గుర్తించే వరకు వారి పార్థివదేహాలను ఆర్మీ బేస్‌ హాస్పిటల్‌లోనే ఉంచనున్నారు. డీఎన్‌ఏ టెస్టులతో సైంటిఫిక్‌గా మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు మిలటరీ అధికారులు. కుటుంబసభ్యులతో కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

డీఎన్‌ఏ టెస్ట్‌ పూర్తయ్యాక వారి కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తారు అధికారులు. ఆ తర్వాత మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తికానున్నాయి. నిన్ననే వారి వారి కుటుంబ సభ్యుల బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించారు అధికారులు.

డెడ్‌బాడీలకు డీఎన్‌ఏ టెస్ట్ చేసి రిపోర్ట్‌ వచ్చిన తర్వాత మృతదేహాలను పంపిస్తామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇవాళ మాత్రం గుర్తించిన నలుగురికి అంత్యక్రియలు జరగనున్నాయి. బిపిన్‌ రావత్‌ దంపతులకు ఢిల్లీలో, లిడ్డర్‌కు పంచకులలో, వివేక్‌ కుమార్‌కు హిమాచల్‌ప్రదేశ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.