హ్యాట్సాఫ్ : వృద్ధురాలికి సహాయం చేసిన మహిళా పోలీసు

  • Published By: madhu ,Published On : September 29, 2019 / 04:45 AM IST
హ్యాట్సాఫ్ : వృద్ధురాలికి సహాయం చేసిన మహిళా పోలీసు

అవసరంలో ఉన్న వారికి తోచిన సాయం చేయమంటారు కొందరు. కానీ కొంతమంది ఏమీ పట్టించుకోరు. నేరాలు, ఘోరాలు తమ కళ్ల ముందు జరుగుతున్నా స్పందించరు. మానవత్వానికి కొన్ని ఘటనలు మాయని మచ్చగా మిగులుతున్నాయి. కానీ ఓ మహిళా పోలీసు అధికారి చేసిన సహాయానికి హ్యాట్పాఫ్ అంటున్నారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి ఓ వృద్ధురాలికి చేసిన సహాయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని దామోహ్‌ జిల్లాలో శ్రద్ధా శుక్లా సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఓ వయసు మీదపడి సొంత వారి ఆదరణకు నోచుకోని వృద్ధురాలు కనిపించింది. దీంతో చలించిపోయిన శ్రద్ధా శుక్లా.. ఆ వృద్ధురాలికి కొత్త దుస్తులు, చెప్పులు కొనిచ్చారు.

Read More : బీహార్‌లో వరదలు : 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్

అంతేకాకుండా ఆమే స్వయంగా వాటిని వృద్ధురాలికి తొడిగారు. కృతజ్ఞతగా ఆ వృద్ధురాలు శ్రద్ధా శుక్లాను కౌగలించుకొని కన్నీటి పర్యంతమైన ఘటన చూపరులను కలచివేసింది. దీనికి సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.