కుండపోత వర్షం, 4 గంటలు డ్యూటీ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 01:58 AM IST
కుండపోత వర్షం, 4 గంటలు డ్యూటీ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Cop Managed Traffic In Heavy Rain For 4 Hours : విధి నిర్వహణలో కొంతమంది ఖచ్చితంగా మెలుగుతుంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా..తమ విధులను మాత్రం మరిచిపోరు. అలాగే..ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నాలుగు గంటల పాటు విధులు నిర్వహించారు. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారు కదా. కుండపోత వర్షం కురుస్తున్నా..ఎక్కడా ట్రాఫిక్ స్తంభించకుండా..విధులు నిర్వహించడం హైలెట్. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.



తమిళనాడు రాష్ట్రంలోని ట్యుటికోరిన్ జిల్లాలో వీవీడీ జంక్షన్ వద్ద ముత్తురాజ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. అదే రోజు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వాన కురుస్తోంది. అయినా..ముత్తురాజ్ పక్కకు వెళ్లలదు. రెయిన్ కోట్ వేసుకుని ట్రాఫిక్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇలా నాలుగు గంటల పాటు ట్రాఫిక్ ను నియంత్రించాడు. ఈ విషయం జిల్లా ఎస్పీ జయకుమార్ కు తెలిసింది.



స్యయంగా ముత్తురాజ్ విధులు నిర్వహిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు ఎస్పీ. ముత్తురాజ్ ను అభినందించారు. అంతేగాకుండా..ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. జిల్లా ఎస్పీ స్వయంగా వచ్చి తనను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని కానిస్టేబుల్ ముత్తురాజ్ చెప్పారు. నెటిజన్ల నుంచి కానిస్టేబుల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.